hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ

సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ

సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ post thumbnail image

ముంబై : ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో వ‌రుస‌గా విజ‌యాలు సాధించినా ఆ జ‌ట్టును, మేనేజ్ మెంట్ ను ప్ర‌ధాన స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది. ప‌నిగ‌ట్టుకుని స్టార్ ప్లేయ‌ర్లు శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ‌ల‌ను ప్ర‌మోట్ చేశారు ఓపెన‌ర్లుగా. కానీ విచిత్రం ఏమిటంటే ఇద్ద‌రూ ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా రాలేక పోవ‌డంతో జ‌ట్టు హెడ్ కోచ్ , మేనేజ్మ‌మెంట్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్ర‌స్తుతం డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న భార‌త్ ప్ర‌స్తుతం సూప‌ర్ 8కి చేరుకుంది. జ‌ట్టు అన్ని విభాగాల‌లో బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన స‌మ‌స్య ఓపెనింగ్ విష‌యంలోనే . ఇక వ‌ర‌ల్డ్ లో నెంబ‌ర్ 1 బ్యాట‌ర్ గా పేరు పొందాడు అభిషేక్ శ‌ర్మ‌.
కానీ అనూహ్యంగా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వ‌రుస‌గా డకౌట్ల‌తో నిరాశ ప‌రిచాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. ఈ త‌రుణంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సందీప్ కిష‌న్ రంగంలోకి వ‌చ్చాడు. సూప‌ర్ ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. మ‌రో వైపు శాంస‌న్ ఇంకా ప‌రుగుల కోసం నానా తంటాలు ప‌డుతున్నాడు. ఈ త‌రుణంలో గంభీర్ ప్ర‌యోగాల‌కు తెర తీస్తాడా లేక అభిషేక్ శ‌ర్మ‌ను ఇలాగే కంటిన్యూ చేస్తాడా అనేది ఉత్కంఠ నెల‌కొంది. ఒక‌వేళ అలాగే కొన‌సాగిస్తే జ‌ట్టులోని ఇత‌ర ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి మ‌రింత పెరుగుతుంది. ఇప్పుడు ఒత్తిడికి లోను కాకుండా ఆడేవాళ్లు కావాలి. ఇదిలా ఉండ‌గా టోర్నీలో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌వుతోంది భార‌త జ‌ట్టు. టోర్నీలో బ‌ల‌మైన టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న స‌ఫారీల‌తో త‌ల‌ప‌డ‌నుంది.
The post సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవంవైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి తెప్పోత్సవాలు శ్రీ రామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎంజిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

విశాఖ‌పట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల గురువారం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. త‌న తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్

Mohan Bhagwat: పాక్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి – మోహన్ భాగవత్‌Mohan Bhagwat: పాక్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి – మోహన్ భాగవత్‌

    పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధిపతి మోహన్‌ భాగవత్‌ అభిప్రాయపడ్డారు. నిజాయితీ గల స్నేహితునిగా భారత్‌కు సహకరించటం ద్వారానే దాయాదికి మేలు జరుగుతుందన్నారు. సంఘ్‌ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా