hyderabadupdates.com Gallery స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు

స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు

స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఒక ర‌కంగా ఆయ‌న చేసిన కామెంట్స్ తీవ్ర క‌ల‌క‌లం రేపాయి పోలీస్ వ‌ర్గాల‌లో. శుక్ర‌వారం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఆరోజు నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారని అన్నారు. ఇప్పుడు అదే సజ్జానార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నాడ‌ని, ఇది ఎలా సాధ్యం అవుతుందంటూ ప్ర‌శ్నించారు. త‌ను ఇష్టానుసారం కేసులు న‌మోదు చేయ‌డానికి లేదా విచార‌ణ చేప‌ట్టాడినికి ఏం అర్హ‌త ఉందంటూ ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నాడని ధ్వ‌జ‌మెత్తారు.
సజ్జనార్ సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేనే లేద‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా అరెస్ట్ అయినప్పుడు SIGగా సజ్జనార్ ఉన్నాడని, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుత డీజీపీ శివదర్ రెడ్డి ఉన్నాడని ధ్వ‌జ‌మెత్తారు. ఆనాడు ఈ సజ్జనార్ ఇంకా కొంత మంది అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఏపీలో కేసులు ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది త‌ప్పు కానే కాద‌ని అన్నాడ‌ని, ఇప్పుడు త‌మ నాయ‌కుల మీద ఎలా ఫోన్ ట్యాపింగ్ కేసు పెడ‌తారంటూ నిల‌దీసే ప్ర‌య‌త్నంచేశారు.
The post స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్

హైదరాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌స్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు ఉన్న‌ట్టుండి కొత్త ఏడాది క‌లిసి వచ్చింది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున

CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులుCII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు

    విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుతో ఏపీకి భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తొలి రోజు శుక్రవారం 40 సంస్థలతో రూ.3,49,476 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా 4,15,890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!

టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితమైన విక్టరీ వెంకటేష్ ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా హిట్ తర్వాత వెంకీ మామ ఇప్పుడు మళ్లీ చాలా కాలం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త