hyderabadupdates.com Gallery స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు

స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు

స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఒక ర‌కంగా ఆయ‌న చేసిన కామెంట్స్ తీవ్ర క‌ల‌క‌లం రేపాయి పోలీస్ వ‌ర్గాల‌లో. శుక్ర‌వారం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఆరోజు నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారని అన్నారు. ఇప్పుడు అదే సజ్జానార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నాడ‌ని, ఇది ఎలా సాధ్యం అవుతుందంటూ ప్ర‌శ్నించారు. త‌ను ఇష్టానుసారం కేసులు న‌మోదు చేయ‌డానికి లేదా విచార‌ణ చేప‌ట్టాడినికి ఏం అర్హ‌త ఉందంటూ ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నాడని ధ్వ‌జ‌మెత్తారు.
సజ్జనార్ సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేనే లేద‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా అరెస్ట్ అయినప్పుడు SIGగా సజ్జనార్ ఉన్నాడని, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుత డీజీపీ శివదర్ రెడ్డి ఉన్నాడని ధ్వ‌జ‌మెత్తారు. ఆనాడు ఈ సజ్జనార్ ఇంకా కొంత మంది అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఏపీలో కేసులు ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది త‌ప్పు కానే కాద‌ని అన్నాడ‌ని, ఇప్పుడు త‌మ నాయ‌కుల మీద ఎలా ఫోన్ ట్యాపింగ్ కేసు పెడ‌తారంటూ నిల‌దీసే ప్ర‌య‌త్నంచేశారు.
The post స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలుఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు

అమరావతి : ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు

వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ అద్భుతంగా ఉంద‌న్నారు. ప్రత్యేకించి వ్య‌వ‌సాయ రంగానికి మ‌రింత ఊతం ఇచ్చేలా ఉండ‌డం ప‌ట్ల

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎంసిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌నా కాలంలో అందినంత మేర క‌ల్వ‌కుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . శాస‌న స‌భ సాక్షిగా తీవ్ర