hyderabadupdates.com movies సమంత బంగారానికి సూర్య సవాల్

సమంత బంగారానికి సూర్య సవాల్

తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా ఉండే రాష్ట్రం కాబట్టి ప్రచారాలు, ఆర్భాటాలు, ఓట్లు వేసే హడావిడి ఇవన్నీ కనీసం రెండు మూడు వారాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇప్పుడు పోలింగ్ ఏప్రిల్ 23 డేట్ గురించి క్లారిటీ వచ్చేయడంతో ఒక్కొక్కటిగా తమ అనౌన్స్ మెంట్లు ఇచ్చేస్తున్నాయి. సూర్య నటించిన కరుప్పు మే 15 రావడం కన్ఫర్మ్ అని చెన్నై వర్గాల విశ్వసనీయ సమాచారం.

అయితే అదే డేటుని ఆల్రెడీ సమంతా మా ఇంటి బంగారంకు లాక్ చేశారు. టీజర్ అంచనాలు రేపగా బిజినెస్ ఎంక్వయిరీలు బాగున్నాయి. సామ్ భర్త రాజ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రాజెక్టు కావడంతో ఓటిటి డీల్ కూడా భారీగా దక్కిందట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాలో సమంతా ఒక సాంప్రదాయ ఇంటి కోడలిగా ఉంటూనే శత్రువులను ఊచకోత కోసే అండర్ కవర్ ఏజెంట్ గా ఒక డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది.

ఇక కరుప్పు విషయానికి వస్తే సుదీర్ఘకాలంగా వాయిదాల్లో నలిగిపోతున్న ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేశాడు. లాయర్, దేవుడిగా రెండు సంబంధం లేని షేడ్స్ ఇందులో ఉంటాయట. దర్శకుడు ఆర్జె బాలాజీ గతంలో నయనతారలో అమ్మోరు తల్లి తీసి ఓటిటి రిలీజ్ లోనే ప్రేక్షకులను మెప్పించారు. అది చూసే సూర్య ఈ ఛాన్స్ ఇచ్చాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ దట్టించిన కరుప్పు షూటింగ్ ఎప్పుడో పూర్తయినా మోక్షానికి మాత్రం చాలా టైం పట్టింది.

మరి సమంతా, సూర్యలను ఒకే గాటన కట్టలేం కానీ కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తున్న ట్రెండ్ లో ఈ ఇద్దరిలో ఎవరు దాన్ని బెటర్ గా అందిస్తారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. సూర్య, సామ్ గతంలో సికందర్ లో జోడిగా నటించారు. ఇది డిజాస్టర్ అయ్యింది. తర్వాత 24 లో కనిపించారు. ఇది విజయం సాధించింది. మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పరస్పరం తలపడటం చూస్తుంటే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏ క్షణంలో ఎవరి రిలీజ్ డేట్లు ఎలా మారతాయో చెప్పలేని ట్రెండ్ లో ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చు.

Related Post

నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!

చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ నిజంగానే దూరం పెడుతున్నాడా?పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ నిజంగానే దూరం పెడుతున్నాడా?

ఏపీలో 2019 నుంచి 2024 వరకు అధికారం చెలాయించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా 151 సీట్ట నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఫలితంగా అప్పటిదాకా బలీయంగా కనిపించిన వైసీపీ.. అత్యంత బలహీన పార్టీగా గోచరించడం మొదలైంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకునేందుకు జగన్ నానా

Rashmika Mandanna-Vijay Deverakonda Reception: Newlywed is on cloud 9 as she poses with her parents; WATCHRashmika Mandanna-Vijay Deverakonda Reception: Newlywed is on cloud 9 as she poses with her parents; WATCH

Earlier, Vijay Deverakonda and Rashmika Mandanna celebrated their wedding by sending sweets across India and offering annadanam at several temples. The actor also announced scholarships for Class 9 and 10 students