hyderabadupdates.com Gallery సమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలి

సమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలి

సమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలి post thumbnail image

హైద‌రాబాద్ : సామాజిక బాధ్య‌త‌తో కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. స‌మాజం కోసం చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న ఖ‌ర్చు వందకు వంద‌ శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు సీఎం. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. విద్యపై పెట్టే ఖ‌ర్చును తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు సీఎం. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ నగరంలోనే 44 శాతం ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించు కుంటున్న క్రమంలో తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని కోరారు.
తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సూచించారు. ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని వెల్ల‌డించారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ కి అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు.
ఈ కీల‌క‌ సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్ , రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షాయణి ఆళ్ల , యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు , గోరుకంటి ఫల్గుణ్ రావు , మేఘా గ్రూప్ నుంచి సుధా రెడ్డి , అపోలో ఆసుపత్రుల గ్రూప్ నుంచి అపర్ణా రెడ్డి , కామినేని భాస్కర్ రెడ్డి , ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్ రెడ్డి , నాదం ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి హాజ‌ర‌య్యారు.
The post సమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రారూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా

రంగారెడ్డి జిల్లా : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం అత్తాపూర్‌లోని రాంబాగ్ స‌ర్వే నంబ‌రు 354/1, 354/2, 354/3ల‌లో 2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని

మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

అమ‌రావ‌తి : త‌మ‌ది స్నేహ పూర్వ‌క‌మైన ప్ర‌భుత్వ‌మ‌ని , ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నామ‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మీ కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి, కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి

Tejas Fighter Jet: దుబాయ్‌ ఎయిర్‌షోలో కూలిన తేజస్‌ యుద్ధవిమానంTejas Fighter Jet: దుబాయ్‌ ఎయిర్‌షోలో కూలిన తేజస్‌ యుద్ధవిమానం

    ప్రపంచంలోనే అతిపెద్దదైన, దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఎయిర్‌ షోలో చివరిరోజు ఘోర ప్రమాదం సంభవించింది. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజ్‌స-ఎమ్‌కే1 కూలిపోయింది. అల్‌ మక్తూమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచిన తేజస్‌, నింగిలో విన్యాసాలు