hyderabadupdates.com Gallery సమ్మె పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : పొన్నం ప్ర‌భాక‌ర్

సమ్మె పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : పొన్నం ప్ర‌భాక‌ర్

సమ్మె పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి :  పొన్నం ప్ర‌భాక‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కోరారు. ఉద్యోగుల సమస్యలను సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం , కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఈ రెండు అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలు వినేందుకు ఎల్లవేళలా తమ తలుపులు తెరిచి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకు వచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశం కూడా ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు పొన్నం ప్ర‌భాక‌ర్. ఎన్నికల షెడ్యుల్ కు 10 రోజులకు ముందు హడావిడిగా విలీనం అంశాన్ని ముందుకు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా , కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఎడి సెక్రటరీ, రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు . కమిటీ ఏర్పాటు అయిన 10 రోజుల్లోనే అక్టోబర్ 10, 2023న ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నవంబర్ 30న ఎన్నికలు జరిగి, డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 7, 2023న ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకొక ముందే , మార్చ్ 16, 2024న లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జూన్ 6 వరకు సుదీర్ఘంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని వివరించారు.
The post సమ్మె పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : పొన్నం ప్ర‌భాక‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీPM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీ

    వందేమాతరం గేయం… దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ..

Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : ఏపీలో అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్‌ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని ఆయన స్పష్టం చేసారు. చరిత్ర

కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కె-ర్యాంప్’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీపావళి టైమ్‌లో అనేక సినిమాలతో పోటీగా విడుదల కావడం ఈ