hyderabadupdates.com Gallery స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం

స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం

స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో త్వ‌ర‌లోనే ప‌నులు చేప‌డ‌తామ‌ని చెప్పారు. 140 ఎక‌రాల‌కు పైగా ఉన్న చెరువు ప‌రిధిలో చాలా వ‌ర‌కు నివాసాలు వ‌చ్చేశాయ‌న్నారు. ఇప్పుడు వాటి జోలికి వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకా 90 ఎక‌రాల‌కు పైగా మిగిలి ఉన్న చెరువునే అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. న‌గ‌రంలో పెద్ద చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని అన్నారు. అందులో స‌రూర్‌న‌గ‌ర్ చెరువు కూడా ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే హైడ్రా క‌మిష‌న‌ర్ స‌రూర్‌న‌గ‌ర్ చెరువును క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ఈ చెరువుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వానికి నివేదించి.. మార్చిలోగా ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు. ఏడాదిలో ప‌నులు పూర్తి చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు.
చెరువుల‌ అభివృద్ధి అంటే పై మెరుగులు దిద్ద‌డం కాద‌ని ఇప్ప‌టికే హైడ్రా పున‌రుద్ధ‌రించిన బ‌తుక‌మ్మ‌కుంట‌, బ‌మృకున్ – ఉద్ -దౌలా, కూక‌ట్‌ప‌ల్లి నల్ల‌చెరువుల‌ను ప‌రిశీలిస్తే అంద‌రికీ అర్థ‌మౌతుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. ఆ దిశ‌గానే స‌రూర్‌న‌గ‌ర్ చెరువును తీర్చిదిద్దుతామ‌ని స్ప‌ష్టం చేశారు. చెరువులో 10 నుంచి 15 అడుగుల మేర పూడిక‌ను తొల‌గించి లోతు పెంచుతామ‌న్నారు. పూడికను తొల‌గించ‌డం ద్వారా నీటి నిలువ సామ‌ర్థ్యం పెంచ‌డ‌మే కాకుండా.. భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌కు మార్గం సుగ‌మం అవుతుంద‌న్నారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు స‌రిగా ఉండేలా చూస్తాం అన్నారు. మ‌రీ ముఖ్యంగా వ‌ర‌ద‌ల నియంత్ర‌ణ‌కు ఈ చెరువు ఉప‌యోగ‌ప‌డేలా తీర్చిదిద్దుతామ‌న్నారు. మురుగు నీరు చెరువులో క‌ల‌వ‌కుండా వాటర్ బోర్డు సహకారంతో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే.. ఎస్‌టీపీల సామ‌ర్థ్యాన్నిపెంచుతామ‌న్నారు.
The post స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Rahul Gandhi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ… అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా

CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌

CP Sajjanar : వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ (CP Sajjanar) ప్రశ్నించారు. వ్యూస్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన