hyderabadupdates.com Gallery స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి

స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి

స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి post thumbnail image

హైద‌రాబాద్ : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వ సన్నద్ధం కావాల్సిన‌ అవసరం ఉందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించు కోవాలని పోలీసు శాఖకు సూచించారు. ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన పోలీస్ ఆఫీస‌ర్స్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి కి వివరించారు.
పోలీసింగ్‌కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎం చెప్పారు. నేరాలను నిరోధించడం, నేరస్థులను త్వరగా గుర్తించడానికి AI టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడమీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
శాంతి భద్రతలు కాపాడటంలో దేశంలో తెలంగాణ ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. అందుకు పోలీసు శాఖను అభినందిస్తున్నా. అయితే, 2047 లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా ఎంపవర్ కావలసిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఫ్యూచర్ రెడీ కోసం పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలు, అనుసరించాల్సిన విధానం, దానికి చట్ట బద్ధత కల్పించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శితో కూడిన కమిటీని నియమిస్తాం అని ప్ర‌క‌టించారు. ఆర్థిక, న్యాయ, సాంకేతిక, పరిపాలన పరమైన అంశాలను చర్చించిన తర్వాత చట్టరూపం కల్పించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
కాగా పోలీసు శాఖను ఎంపవర్ చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఇబ్బంది లేదన్నారు. కానీ ఫలితాలొచ్చే విధంగా ఆ నిధులు సద్వినియోగం అవుతాయన్న ఒక విశ్వాసం కల్పించాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు సీఎం. మనకున్న ఫిజికల్ క్రైమ్, మన ఎకోసిస్టమ్ ఆధారంగా మాన్యువల్స్ రాసుకున్నాం. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. నేర స్వరూపమే పూర్తిగా మారిపోయింది. సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి కొత్త సమస్యలొచ్చాయని తెలిపారు. పోలీసు అధికారులు మొట్టమొదట సమస్య ఏంటో అర్థం చేసుకోగలగితే సగం సమస్య పరిష్కారమైనట్టేన‌ని అన్నారు. సమస్య అర్థం కానప్పుడు వేగంగా పరిష్కరించాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదన్నారు.
The post స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు

న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డిన‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మున్సిప‌ల్ , మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజ‌యాన్ని చేకూర్చి పెట్టార‌ని అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలో

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్