hyderabadupdates.com Gallery సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల

సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల

సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల post thumbnail image

అమరావతి : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిలకు సంబంధించి రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. గతంలో చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి మరో విడత బకాయిలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత నెలలో రూ.2.42 కోట్ల మేర బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లించామని చెప్పారు. సంక్రాంతి పండగ దృష్ట్యా మరో రూ.5 కోట్లు చెల్లించాలని ఆప్కో యాజమాన్యాన్ని మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి సవిత ఆదేశాల మేరకు సోమవారం చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో బకాయిలు జమ చేయడానికి ఆప్కో సిద్ధమైంది.
చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత ఈ సంద‌ర్బంగా స్ప‌ష్టం చేశారు. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి పొందేలా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో సామూహికంగా చేనేత సహకార సంఘాల ద్వారా లబ్ధి కలిగేలా మరికొన్ని పథకాలు వర్తింప జేస్తున్నామన్నారు ఎస్. స‌విత‌. చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు నూతన కొనుగోళ్లను సైతం ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. నేతన్నలు గౌరవ ప్రదమైన జీవనం సాగించడంతో 365 రోజులూ వారికి ఉపాధి కల్పించాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యమన్నారు.
The post సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదలSSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

  ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి.

ఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటనఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటించింది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ

MBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదంMBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదం

    వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు ఎన్ఎంసీ శుభవార్త చెప్పింది. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలియజేసింది. అలాగే కొత్తగా 41 వైద్య కశాళాలలు కూడా రాబోతున్నాయి.