hyderabadupdates.com Gallery సాగు నీటి ప్రాజ‌క్టుల కోసం రూ. 8 వేల కోట్లు

సాగు నీటి ప్రాజ‌క్టుల కోసం రూ. 8 వేల కోట్లు

సాగు నీటి ప్రాజ‌క్టుల కోసం రూ. 8 వేల కోట్లు post thumbnail image

అనంత‌పురం జిల్లా : సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని కూట‌మి స‌ర్కార్ రాష్ట్రంలో నీటి ప్రాజ‌క్టుల‌కు భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సమీపంలోని 8వ డిస్ట్రిబ్యూటరీ వద్ద కెనాల్ ను అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, జోన్-5 ఇన్చార్జి నాని , అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ,ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ కేశవ రెడ్డి ,టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడుతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ఇవాళ దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టే డ్రామాలకు తెర తీస్తున్నారని అన్నారు. కేవలం 19 నెలల చంద్రబాబు నాయుడు పాలనలోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 8,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు.
ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంద‌న్నారు బండారు శ్రావ‌ణి శ్రీ‌. హంద్రీ నీవా ప్రాజెక్టు కూటమి ప్రభుత్వ పాలనలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 3,780 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేయడంతో పాటు, కేవలం 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించామని చెప్పారు ఎమ్మెల్యే. దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంద‌న్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకలతో కళకళ లాడుతున్నాయని పేర్కొన్నారు. మొత్తం 464 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 366 టీఎంసీల నీటిని నిల్వ చేసి చరిత్ర సృష్టించామన్నారు బండారు శ్రావ‌ణి శ్రీ‌.
The post సాగు నీటి ప్రాజ‌క్టుల కోసం రూ. 8 వేల కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలుప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన స్థ‌లాల‌లో ఆక్ర‌మ‌ణ‌లకు పాల్ప‌డ‌డ‌మే కాకుండా బ‌హుళ అంత‌స్తులు నిర్మించ‌డంపై ఫోక‌స్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌లు సృష్టించారు క‌బ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్‌తో

వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌తవ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌త

అమ‌రావ‌తి : వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వ్యక్తిగతంగా అందించామని

ఓటు ప్ర‌క్షాళ‌న వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డిఓటు ప్ర‌క్షాళ‌న వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కార్య‌క‌ర్త‌ల గెలుపు కోసం తాను గ‌ల్లీ గ‌ల్లీ కాదు ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో లో 80 శాతం మహాత్మా