hyderabadupdates.com Gallery సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా

సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా

సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా post thumbnail image

హైద‌రాబాద్ : ఆప్ ఎంపీ రాఘవ్‌చద్దా అనే ఈ యువ పార్లమెంటేరియన్ ఎన్నడూ సామాన్యుల జీవితాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదు. అలాగే మధ్య తరగతి జీవితాల్ని ఉద్దరించే ప్రశ్నలూ లేవనెత్త లేదు. ఎగువ మధ్య తరగతి, ధనవంతుల గురించే ఎక్కవ మాట్లాడాడు. విమాన చార్జీల గురించి, విమానాశ్రయాల్లో సదుపాయాల గురించి మాట్లాడిన ఎంపీ రైళ్ల గురించి ఒక్కమాటైనా మాట్లాడాడా? జనరల్ బోగీల కుదింపు మాట్లాడాడా? ఎత్తేసిన రైల్వేస్టేషన్లు, రద్దైన రైళ్ల గురించి, రైలు టిక్కెట్ల గురించి మాట్లాడాడా? ప్రజల కనీస అవసరాల గురించి గాక సెల్‌ఫోన్లో వాడే డేటా గురించి మాట్లాడాడు.
పరీక్ష ఫెయిలవడం కన్నా రాత్రి క్రికెట్లో ఆర్సీబీ ఓడిపోవడం ఎక్కువ బాధపడే స్టూడెంట్లు, ఉద్యోగం రాకపోయినా ఫలానా రాజకీయపార్టీ నాయకుడి మీద ఈగ వాలడం సహించని మగరాయుళ్ళూ, నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను గాక సీరియల్లో హీరోయిన్‌కు వచ్చే ఇబ్బందులు తల్చుకుని బాధపడే మహిళలున్న సమాజంలో రాఘవ్‌చద్దా ఒక ఉద్దరాక రాజకీయ నాయకుడిగా కనిపించడంలో తప్పేమీ కాదు. పైగా మనకి ఎర్రగా, బుర్రగా, స్టైల్‌గా, రిచ్‌గా, సినిమా హీరోలా వుంటే చాలు, వాడేం చేసినా నచ్చేయడం మన బలహీనత.
అయినా, ఎన్నడో అమ్ముడు పోయిన మీడియా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రోజూ పార్లమెంటులో అత్యవసరమైన అన్ని విషయాల మీద మాట్లాడే ప్రధాన‌ ప్రతిపక్ష నాయకుడిని గానీ, ఇతర పార్టీల నేతలని గానీ గాకుండా ఒక మామూలు ఎంపీని ఆకాశానికెత్తి ప్రచారం చేస్తున్నప్పుడైనా కనీస అనుమానం మనకు రావాలి. ఇతడు స్పాన్సర్డ్ నాయకుడని. తెలివిగా ప్రజల అవసరాల్ని, అజెండాని హైజాక్ చేస్తున్నాడని. (సుభాష్ చంద్ర‌బోస్ )
The post సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్

కేర‌ళ : కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ కు బిగ్ షాక్ త‌గిలింది. రేప్ చేసిన కేసులో త‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలుకు త‌ర‌లించారు. గ‌త‌ డిసెంబర్ 2024లో పాలక్కాడ్ ఉప ఎన్నికలో రాహుల్ సాధించిన అద్భుత విజయం తర్వాత

రూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రారూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాణ‌వాయువును అందించే పార్కుల క‌బ్జాల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. ఫిర్యాదు అందిన వెంట‌నే రంగంలోకి దిగి వాటిని ర‌క్షిస్తోంది. ఇలా ఒకే రోజు ఒకే

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌

లాహోర్ : ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భార‌త్, శ్రీ‌లంక దేశాలు. ఈ సంద‌ర్బంగా భార‌త్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ