hyderabadupdates.com movies సారీ చెప్పినా క్షమించని హీరోయిన్

సారీ చెప్పినా క్షమించని హీరోయిన్

తెలుగులో ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాలో నటించిన తమిళ కథానాయిక గౌరి కిషన్‌ పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలిసిన ఆమెను.. ఆర్.ఎస్.కార్తీక్ అనే సీనియర్ తమిళ సినీ జర్నలిస్టు అడిగిన ప్రశ్న దుమారం రేపింది. మీ బరువు ఎంత.. ఈ మధ్య వెయిట్ పెరిగినట్లున్నారే అని ఆ జర్నలిస్టు అడగ్గా.. నేనెందుకు నా వెయిట్ చెప్పాలి అంటూ ఆమె ఫైర్ అయింది. 

ఇది అసలు జర్నలిజమే కాదంటూ ఆమె ఆ జర్నలిస్టుతో చాలా సేపు వాగ్వాదానికి దిగింది. ఆ జర్నలిస్టు కూడా గట్టిగానే ఎదురుదాడి చేశాడు. ఐతే సోషల్ మీడియా పూర్తిగా గౌరి వైపే నిలిచింది. ఇవేం ప్రశ్నలు అంటూ ఆ జర్నలిస్టు తీరును అందరూ దుయ్యబట్టారు. అలాంటి ప్రశ్నలు అడగడమే తప్పంటే.. మళ్లీ వాదించడమా అంటూ ఆయన్ని నిలదీశారు. ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ జర్నలిస్టు గౌరి కిషన్‌కు సారీ చెబుతూ ఒక వీడియో కూడా చేయాల్సి వచ్చింది. 

కానీ బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆయన ఈ వివరణలో పేర్కొన్నాడు. దీంతో గౌరి కిషన్‌కు ఇంకా కోపం వచ్చింది. ఇదసలు క్షమాపణ లాగే లేదని.. దీన్ని తాను అంగీకరించనని ఆమె తేల్చి చెప్పింది. ఆయన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పడం.. బాడీ షేమింగ్ చేయలేదు అనడం.. అది సరదాగా అన్న ప్రశ్న అనడంపై ఆమె అభ్యంతరం వ్యక్త ంచేసింది. 

ఇంకా బెటర్‌గా ట్రై చేయండి కార్తీక్ అంటూ ఘాటుగా బదులిచ్చింది గౌరి కిషన్. మరోసారి సోషల్ మీడియా ఆమె వైపే నిలిచింది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఇలాగే స్పందిస్తుందని.. చేసిన తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. ఇలాంటి వివరణ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం అని ఆ జర్నలిస్టుపై నెటిజన్లు మరోసారి ఫైర్ అవుతున్నారు.

Related Post

పెద్ది దర్శకుడికి ఏమైంది?పెద్ది దర్శకుడికి ఏమైంది?

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు బుచ్చిబాబు సనా. తన దర్శకత్వ ప్రతిభ చూసి ఇండస్ట్రీ షాకైపోయింది. రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు. దీన్ని కూడా అతను సద్వినియోగం చేసుకునేలాగే

నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి