hyderabadupdates.com movies సారీ చెప్పినా క్షమించని హీరోయిన్

సారీ చెప్పినా క్షమించని హీరోయిన్

తెలుగులో ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాలో నటించిన తమిళ కథానాయిక గౌరి కిషన్‌ పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలిసిన ఆమెను.. ఆర్.ఎస్.కార్తీక్ అనే సీనియర్ తమిళ సినీ జర్నలిస్టు అడిగిన ప్రశ్న దుమారం రేపింది. మీ బరువు ఎంత.. ఈ మధ్య వెయిట్ పెరిగినట్లున్నారే అని ఆ జర్నలిస్టు అడగ్గా.. నేనెందుకు నా వెయిట్ చెప్పాలి అంటూ ఆమె ఫైర్ అయింది. 

ఇది అసలు జర్నలిజమే కాదంటూ ఆమె ఆ జర్నలిస్టుతో చాలా సేపు వాగ్వాదానికి దిగింది. ఆ జర్నలిస్టు కూడా గట్టిగానే ఎదురుదాడి చేశాడు. ఐతే సోషల్ మీడియా పూర్తిగా గౌరి వైపే నిలిచింది. ఇవేం ప్రశ్నలు అంటూ ఆ జర్నలిస్టు తీరును అందరూ దుయ్యబట్టారు. అలాంటి ప్రశ్నలు అడగడమే తప్పంటే.. మళ్లీ వాదించడమా అంటూ ఆయన్ని నిలదీశారు. ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ జర్నలిస్టు గౌరి కిషన్‌కు సారీ చెబుతూ ఒక వీడియో కూడా చేయాల్సి వచ్చింది. 

కానీ బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆయన ఈ వివరణలో పేర్కొన్నాడు. దీంతో గౌరి కిషన్‌కు ఇంకా కోపం వచ్చింది. ఇదసలు క్షమాపణ లాగే లేదని.. దీన్ని తాను అంగీకరించనని ఆమె తేల్చి చెప్పింది. ఆయన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పడం.. బాడీ షేమింగ్ చేయలేదు అనడం.. అది సరదాగా అన్న ప్రశ్న అనడంపై ఆమె అభ్యంతరం వ్యక్త ంచేసింది. 

ఇంకా బెటర్‌గా ట్రై చేయండి కార్తీక్ అంటూ ఘాటుగా బదులిచ్చింది గౌరి కిషన్. మరోసారి సోషల్ మీడియా ఆమె వైపే నిలిచింది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఇలాగే స్పందిస్తుందని.. చేసిన తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. ఇలాంటి వివరణ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం అని ఆ జర్నలిస్టుపై నెటిజన్లు మరోసారి ఫైర్ అవుతున్నారు.

Related Post

ఎస్‌! వైఎస్‌-కేసీఆర్ నుంచి మీరు నేర్చుకున్న‌దేంటి జ‌గ‌న్ స‌ర్‌?ఎస్‌! వైఎస్‌-కేసీఆర్ నుంచి మీరు నేర్చుకున్న‌దేంటి జ‌గ‌న్ స‌ర్‌?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ.. కొన్ని విష‌యాల‌ను ప్ర‌స్తావించిన మాజీ సీఎం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అవి త‌న‌కు మాత్రం వ‌ర్తించ‌వ‌ని అనుకున్నారో ఏమో.. అనే సందేహం వ‌స్తోంది. ఎందుకంటే.. హైటెక్ సిటీని తానే డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు

వీడియో: అంబటి సంక్రాంతి సంబరాలువీడియో: అంబటి సంక్రాంతి సంబరాలు

భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే పాటకు భోగి మంటల చుట్టూ తిరుగుతూ స్టెప్పులు వేసి, “సంక్రాంతి అంటే నేనే” అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి