hyderabadupdates.com Gallery సింగ‌రేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్ర‌సాద్

సింగ‌రేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్ర‌సాద్

సింగ‌రేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్ర‌సాద్ post thumbnail image

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో ఐఏఎస్ లు, ఐపీఎస్ ఆఫీస‌ర్లు ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా బుధ‌వారం ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అత్యంత కీల‌క‌మైన సింగ‌రేణి సంస్థ‌కు చీఫ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ జ్యోతి బుద్ద ప్ర‌సాద్ ను నియ‌మించింది. ఆయ‌న ఎంబీబీఎస్ చ‌దివారు. రాష్ట్ర ప‌రిపాల‌న‌లో కీల‌క పాత్ర పోషించాడు. ప్ర‌ణాళిక విభాగానికి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగ‌గా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం సింగ‌రేణికి పూర్తి స్తాయి ఆఫీస‌ర్ గా నియ‌మించ‌బ‌డ్డాడు. జ్యోతి బుద్ద ప్ర‌సాద్ గ‌తంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యదర్శిగా, రవాణా కమిషనర్, రిజిస్ట్రేషన్లు స్టాంపుల కార్యదర్శిగా పనిచేశారు.
2002 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్. వామ‌ప‌క్ష తీవ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డంలో అనుభవం క‌లిగి ఉన్నారు. పట్టణాభివృద్ధి, భూమి రికార్డులు సహా విభిన్న, కీలకమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. జ్యోతి బుద్ద ప్ర‌సాద్ క్షేత్ర స్థాయిలోనూ, రాష్ట్ర ప్రధాన కార్యాలయ స్థాయిలోనూ ఉన్న విస్తృత అనుభవానికి గుర్తింపు పొందారు. ఇదే స‌మ‌యంలో జీహెచ్ఎంసీకి క‌మిష‌న‌ర్ గా క‌ర్ణ‌న్ కొన‌సాగుతారు. కొత్త‌గా ఏర్ప‌డిన సైబ‌రాబాద్ , మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు కూడా క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మించింది స‌ర్కార్. సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి. సృజనను, మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు.
రాబోయే రోజుల‌లో ఇంకెంత మంది ఆఫీస‌ర్లను మారుస్తారోన‌న్న ఆందోళ‌న నిజాయితీగా ప‌ని చేసే వాళ్ల‌తో పాటు ఇత‌రుల‌లో నెల‌కొంది.
The post సింగ‌రేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్ర‌సాద్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

2.6 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకులు తిరిగి రాక‌2.6 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకులు తిరిగి రాక‌

న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రిత్వ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ప‌శ్చిమాశియా నుంచి ఏకంగా 2.60 ల‌క్ష‌ల మంది తిరిగి ఇండియాకు వ‌చ్చార‌ని తెలిపింది. యూఏఈలోని వివిధ

MK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీMK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీ

    తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అధికార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు