hyderabadupdates.com movies సింగర్ చిన్మ‌యిపై కేసు

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు కార‌ణం. ఒక వ‌ర్గం మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా వ్యాఖ్య‌లు చేసినందుకు రెండు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

అమెరికాలో ఎప్‌స్టీన్ అనే ఒక వ్యాపార‌వేత్త.. ఒక పార్టీలో భాగంగా త‌న అతిథుల కోసం చిన్న వ‌య‌సు అమ్మాయిలను ఏర్పాటు చేయించాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. దీని మీద అమెరికాలో పెద్ద దుమారం రేగింది. ఎప్‌స్టీన్ గురించి సోష‌ల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టుపై చిన్మ‌యి స్పందిస్తూ చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి.

ఎప్‌స్టీన్ గ‌నుక ఇండియాలో పుట్టుండి అతను దేవుడి పాట‌లు పాడ‌డం, భ‌జ‌న‌లు చేయ‌డం లాంటివి చేసి ఉంటే.. అత‌ను ఇక్క‌డ బాబాజీ అయ్యేవాడ‌ని, అత‌ణ్ని జ‌నాలు నెత్తిన పెట్టుకునేవార‌ని వ్యాఖ్యానించింది. దీంతో సోష‌ల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌తిదాన్నీ హిందూ మ‌తానికి ముడిపెట్టి వివాదం రాజేయ‌డం, హిందువుల‌ను రెచ్చ‌గొట్ట‌డం చిన్మ‌యికి అల‌వాటైపోయిందంటూ ఆమె మీద నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆమెపై ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె పాత వ్యాఖ్య‌ల మీద కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. పెళ్ల‌యిన మ‌హిళ‌లు మంగ‌ళ‌సూత్రం ధ‌రించే విష‌య‌మై కొన్ని నెల‌ల కింద‌ట చిన్మ‌యి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద వివాదానికి దారి తీశాయి.

ఆమెకు మ‌ద్ద‌తుగా మాట్లాడిన త‌న భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ సైతం విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. చిన్మయి ఎంత‌సేపూ హిందూ మ‌తంలో ప‌ద్ధ‌తులు, సంస్కృతికి సంబంధిన‌ విష‌యాల‌నే త‌ప్పుబ‌ట్ట‌డం.. మిగ‌తా మ‌తాల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం.. ప‌దే ప‌దే రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల ఆమెను తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్న వ్య‌క్తులు ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదైంది.

Related Post

తమన్ అసలు పనితనం బయటపడిందితమన్ అసలు పనితనం బయటపడింది

ఇవాళ అఖండ 2 ఫుల్ ఆడియో జ్యుక్ బాక్స్ విడుదలయ్యింది. సినిమా రిలీజ్ కు సరిగ్గా మూడు రోజుల ముందు అన్ని పాటలు వదిలేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిన్నటిదాకా వచ్చిన రెండు లిరికల్ సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ రాలేదు.

అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీల‌కు అతీతీంగా నాయ‌కులు.. స్పందించారు. జ‌గ‌న్ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడు కూడా అదే

ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !

రైతుల ప‌క్ష‌పాతిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఉన్న పేరు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హ‌యాం చిన్న‌దే అయినా.. ఎక్కువ‌గా రైతుల‌కు మేలు చేశార‌న్న వాద‌న ఉంది. ఇది.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశంగా మారింది. 2004-09 మ‌ధ్య తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు..