hyderabadupdates.com movies సింపుల్ కథలు వద్దంటున్న సుప్రీమ్ హీరో

సింపుల్ కథలు వద్దంటున్న సుప్రీమ్ హీరో

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి రోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని అవాంతరాలు వచ్చాయనే టాక్ అప్పట్లో వినిపించింది కానీ తర్వాత మళ్ళీ చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం చివరి దశ పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. డేట్ త్వరలో ప్రకటిస్తారు.

బడ్జెట్ పరంగా సంబరాల ఏటిగట్టు చాలా గ్రాండ్ స్కేల్ లో రూపొందుతోంది. థియేటర్ బిజినెస్ తో రికవరీ చేయడం కష్టమనే స్థాయిలో ఖర్చు పెట్టారు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా ‘క’ దర్శక ద్వయంతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు సాయి దుర్గ తేజ్. ఇది కూడా పెద్ద బొమ్మే. మన శంకరవరప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాత సాహు గారపాటి ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుడుతున్నారు. క తరహాలో ఇది కూడా మిస్టిక్ థ్రిల్లరే.

చూస్తుంటే విరూపాక్ష నుంచి సాయి దుర్గ తేజ్ ఆలోచనా విధానం మారినట్టు ఉంది. రిపబ్లిక్ లాంటి సోషల్ మెసేజులు, చిత్రలహరి లాంటి లవ్ ఎమోషనల్ డ్రామాలు కాకుండా అన్ని ఇంటెన్స్ మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ తో బ్రో చేశాక అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం సాయి తేజ్ కి నిరాశ కలిగించింది. పెద్ద హిట్టయి ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ అవుతుందనుకుంటే అదో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

వీటి సంగతి పక్కనపెడితే సాయి దుర్గ తేజ్ లాంటి వాళ్ళు కూడా ఒక్కో సినిమా రెండేళ్లు తీసుకోవడం ఏ మాత్రం సబబుగా లేదు. కొంచెం స్పీడ్ పెంచి ఎక్కువ చేయడం వల్ల దర్శకులకు అవకాశాలు పెరుగుతాయి. ఒక్క ఏడాదిలో పవన్ కళ్యాణ్ అంతటి టయర్ 1 స్టార్ మూడు సినిమాలు రిలీజ్ చేయగలిగినప్పుడు సాయి మాత్రం ఒకే సినిమా మీద ఇంతేసి సమయం గడపడం సేఫ్ కాదు. ఇకనైనా వేగం పెంచి సంవత్సరానికి కనీసం రెండు రిలీజులు ఉండేలా చూసుకుంటే మంచిది.

Related Post

Prabhas’ ‘Spirit’ Sound Story Ignites Fans’ Hearts in Five Indian Languages!Prabhas’ ‘Spirit’ Sound Story Ignites Fans’ Hearts in Five Indian Languages!

Prabhas’ birthday turned extra special this year with a powerful surprise for fans — the makers of Spirit dropped a special ‘Sound Story’, presented in five Indian languages. The video