hyderabadupdates.com movies సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా.. ఇంకే రకంగా ఇబ్బంది పెట్టినా డైరెక్టర్లు, నిర్మాతలు సర్దుకుపోవాల్సిందే. వాళ్లు అగ్రిమెంట్లకు కట్టుబడకపోయినా లీగల్ చర్యలకు వెళ్లడం అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్మాత.. ఓ స్టార్ హీరో నుంచి భారీ నష్టపరిహారం రాబట్టబోతున్నాడు. ఆ నిర్మాత ఫర్హాన్ అక్తర్ కాగా.. అతడికి పరిహారం చెల్లించబోతున్న హీరో రణ్వీర్ సింగ్.

‘దురంధర్’ సినిమాతో రణ్వీర్ సింగ్ రేంజే మారిపోయింది. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అతను ఎదిగిపోయాడు. ఐతే ఈ సినిమా తర్వాత తనపై పెరిగే అంచనాలకు తగ్గ ప్రాజెక్టులనే అతను ఎంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇంతకుముందు కమిటైన సినిమాల విషయంలో పునరాలోచన చేస్తున్నాడు. అందులో ‘డాన్-3’ ఒకటి.

ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమా తీయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ సినిమా చేయడం కరెక్ట్ కాదని రణ్వీర్ ఫిక్సయ్యాడు. ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగాడు. కానీ రణ్వీర్‌‌ను నమ్మి ప్రి ప్రొడక్షన్ చేసుకుని సినిమా చేయడానికి రెడీ అయిన ఫర్హాన్.. ఈ హీరో నిర్ణయంతో తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో రణ్వీర్ నుంచి నష్టపరిహారం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రణ్వీర్ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని తన వల్ల జరిగిన నష్టానికి రూ.10 కోట్ల మేర పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఐతే నేరుగా ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా.. తాను హీరోగా నటించబోయే ‘ప్రళయ్’ సినిమాలో తన తరఫున రూ.10 కోట్లకు వాటాదారుగా ఫర్హాన్‌ను ఆ ప్రాజెక్టులో చేరుస్తున్నాడట. ‘ప్రళయ్’ జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న జాంబీ థ్రిల్లర్. రణ్వీర్ నెక్స్ట్ మూవీ ఇదే. మరోవైపు ‘డాన్-3’లో హృతిక్ హీరోగా నటించొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Related Post

Twitterati react to rumored lovebirds Thalapathy Vijay and Trisha Krishnan’s first public appearance togetherTwitterati react to rumored lovebirds Thalapathy Vijay and Trisha Krishnan’s first public appearance together

Their public appearance comes at a time when speculation about their alleged relationship continues to attract attention. Recently, Thalapathy Vijay’s wife Sangeetha Sornalingam reportedly filed for divorce, bringing an end