hyderabadupdates.com movies సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల అంద‌రూ అన్ని భాష‌ల సినిమాలనూ చూసేస్తున్నారు. ఒక‌ప్పుడంటే తమిళ, హిందీ రీమేక్‌లు అంటేనే వాటి విశేషాలు బ‌య‌టికి వ‌చ్చేవి. కానీ ఇప్పుడు మ‌ల‌యాళ సినిమాల‌తో మ‌న వాళ్ల‌కు బాగా యాక్సెస్ వ‌చ్చేసింది. ఆ చిత్రాలు తెలుగు డ‌బ్బింగ్‌తో అందుబాటులోకి వ‌స్తున్నాయి. దీంతో అక్క‌డి సినిమాల‌ను తీసుకొచ్చినా స‌రే ప్రోమోలు చూడ‌గానే గుర్తు ప‌ట్టేస్తున్నారు.

విదేశీ భాషా చిత్రాలను రీమేక్ చేస్తుంటేనే ముందే క‌థ స‌హా అన్ని విష‌యాలూ బ‌య‌టికి వ‌చ్చేస్తున్న‌పుడు ప్రాంతీయ భాషా చిత్రాలను రీమేక్ చేస్తే ప‌రిస్థితి ఏంటో చెప్పాల్సిన ప‌ని లేదు. రీమేక్ అన‌గానే ఎగ్జైట్మెంట్ పోతోంది. అందులోనూ వేరే భాష‌లో బాగా పాపుల‌ర్ అయిన సినిమాల‌ను రీమేక్ చేస్తే మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌దు. అయిన‌ప్ప‌టికీ మ‌ల‌యాళంలో పెద్ద హిట్ట‌యిన జ‌య‌జ‌య‌జ‌య‌జ‌య‌హే చిత్రాన్ని తెలుగులో ఓం శాంతి శాంతి శాంతిహి పేరుతో రీమేక్ చేశారు. త‌రుణ్ భాస్క‌ర్, ఈషా రెబ్బా జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని స‌జీవ్ రూపొందించాడు. 35 నిర్మాత సృజ‌న్ ప్రొడ్యూస్ చేశాడు.

ఈ సినిమా టీజ‌ర్ చూస్తే.. ఒరిజిన‌ల్లో హైలైట్ అయిన కోర్ పాయింట్‌ను దాచిపెట్టేశారు. ఎక్స్‌ట్రా ఎంట‌ర్టైన్మెంట్ ఇవ్వ‌డానికి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించిన‌ట్లు క‌నిపించింది. టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డ‌మేంటి అనే పాయింట్ మీద హీరో త‌రుణ్ భాస్క‌ర్, నిర్మాత సృజ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రీమేక్ అనేది ప‌క్క‌న పెట్టాల‌ని.. నిజాయితీగా సినిమా చేశామ‌ని.. రీమేక్ అనే ఫీలింగ్ రాకుండా ప్ర‌య‌త్నం చేశామ‌ని త‌రుణ్ భాస్క‌ర్ తెలిపాడు. ఈ సినిమా న‌చ్చితేనే చూడాల‌ని, న‌చ్చ‌క‌పోతే బాలేద‌ని న‌లుగురికి చెప్పాల‌ని అన్నాడు త‌రుణ్‌. పెళ్ళిచూపులు రీమేక్ మ‌ల‌యాళంలో వంద రోజులు ఆడిన విష‌యాన్ని అత‌ను గుర్తు చేశాడు.

ఇక నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా మొద‌లైన‌పుడు సోష‌ల్ మీడియాలో నెగెటివ్ కామెంట్ల‌ను చూశాన‌ని చెప్పాడు. నిర్మాత‌కు డ‌బ్బులు ఎక్కువై ఈ సినిమా చేస్తున్నాడా అని కూడా కామెంట్లు వ‌చ్చాయ‌న్నాడు. ఐతే 35 సినిమా చేసిన‌పుడు అది క్లాసిక్ అవుతుంద‌ని చెప్పాన‌ని.. అలాగే ఈ సినిమాకు కూడా ఒక మాట చెబుతున్నాన‌ని.. ఇది జ‌స్ట్ రీమేక్ కాద‌ని, అంత‌కుమించి ఇందులో విశేషాలు ఉన్నాయ‌ని.. సినిమా చూస్తున్న‌పుడు రీమేక్ అనే ఫీలింగే రాద‌ని.. అది త‌న గ్యారెంటీ అని చెప్పాడు.

Related Post

4 Tamil and Telugu Films to Watch on OTT This Week: Arun Vijay starrer Retta Thala to Aadi Saikumar’s Shambhala4 Tamil and Telugu Films to Watch on OTT This Week: Arun Vijay starrer Retta Thala to Aadi Saikumar’s Shambhala

Cast: Vikram Prabhu, LK Akshay Kumar, Anishma Anilkumar, Ananda Thambirajah, Harishankar Narayanan, Remya Suresh, Munnar Ramesh Director: Suresh Rajakumari Genre: Courtroom Crime Drama Runtime: 2 hours and 4 minutes Language:

విజయవాడ పునుగులు తిన్న బిల్ గేట్స్విజయవాడ పునుగులు తిన్న బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్‌, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ విధానాల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్. అయతే, కేవలం టెక్నాలజీకి సంబంధించిన

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్ సరోజతో కలిసి వెళ్లారు. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన పట్టుబట్టారు. ఈ క్రమంలోనే