hyderabadupdates.com movies సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్ కోసం థియేటర్లు ముస్తాబు అవుతుండేవి. ఓవర్సీస్‌లో మరి కొన్ని గంటల్లో ప్రిమియర్స్ కూడా మొదలైపోయేవి. విజయ్ చివరి చిత్రం కావడంతో ‘జననాయగన్’కు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చుండేవి. బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. కానీ సెన్సార్ సమస్యలతో ఈ సినిమా రిలీజ్ అనూహ్యంగా ఆగిపోయింది.

వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లగా.. రేపు ఉదయమే తీర్పు వెలువురించాల్సి ఉండడంతో రిలీజ్ వాయిదా వేయడం అనివార్యమైంది. దీని వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మామూలు ఇబ్బంది తలెత్తలేదు. విదేశాల్లో కొన్ని వారాల ముందే బుకింగ్స్ మొదలుపెట్టారు. భారీ స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండియాలో కూడా కొన్ని రోజుల కిందట బుకింగ్స్ మొదలుపెట్టారు. సినిమాకు సెన్సార్ కాకముందే పెద్ద ఎత్తున టికెట్లు అమ్మారు.

కానీ ‘జననాయగన్’ అనూహ్యంగా వాయిదా పడిపోవడంతో అమ్మిన టికెట్లన్నీ రద్దయిపోయాయి. తమిళనాడులో పూర్తి స్థాయిలో టికెట్ల అమ్మకం మొదలు కాకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ జరగకపోయినా.. వరల్డ్ వైడ్ ‘జననాయగన్’కు రూ.60 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషం.

ఒక్క ఉత్తర అమెరికాలో మాత్రమే ఈ సినిమా ప్రి సేల్స్‌తోనే 4.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇంకా పలు దేశాల్లో పెద్ద ఎత్తున టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఈ సినిమా వాయిదా అని తేలడానికి ముందు వరల్డ్ వైడ్ ప్రి సేల్స్ మొత్తం రూ.60 కోట్లకు చేరింది.

నిన్న రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సినిమా వాయిదా అని ప్రకటించగానే టికెట్లు అన్నీ క్యాన్సిల్ చేసి ఈ రూ.60 కోట్ల రీఫండ్ మొదలుపెట్టాయి వరల్డ్ వైడ్ థియేటర్ ఛైన్స్. ఈ స్థాయిలో టికెట్లు అమ్మి.. రిలీజ్ కోసం పెద్ద ఎత్తున థియేటర్లు సిద్ధం చేసి, అన్ని ఏర్పాట్లూ చేశాక ఇలా సినిమా వాయిదా పడడం, రీఫండ్స్ ఇవ్వడం ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దీని వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నష్టం భారీగానే ఉంటుంది. సినిమాకు మళ్లీ ఇంత మంచి డేట్ దొరుకుతుందా.. బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు ఉంటాయా.. అప్పుడు ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ ఉంటుందా అన్నది సందేహమే.

Related Post

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆ నమ్మకం ఓడిపోయింది. దాదాపు ఆరేళ్ల (2,462 రోజులు) తర్వాత.. కోహ్లీ సెంచరీ కొట్టినా భారత్ ఓడిపోయిన అరుదైన

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వాళ్లు నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే బన్నీ, అట్లీ ఇద్దరికీ విడివిడిగా భారీ