hyderabadupdates.com movies సుధీర్ బాబును దేవుడు కూడా కాపాడలేదు

సుధీర్ బాబును దేవుడు కూడా కాపాడలేదు

15 ఏళ్ల కెరీర్.. 20 సినిమాలు.. అందులో హిట్లు అని చెప్పుకోదగ్గవి కేవలం మూడు సినిమాలు మాత్రమే. మిగతావన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. ఇదీ సుధీర్ బాబు పరిస్థితి. మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నా.. కథల ఎంపికలో తన అభిరుచిని చాటుకున్నా.. సక్సెస్ మాత్రం అతడితో దోబూచులాడుతూనే ఉంది. ‘సమ్మోహనం’ సినిమా అతడికి పెద్ద బ్రేక్ ఇచ్చి కెరీర్‌కు మంచి ఊపు తీసుకొచ్చింది కానీ.. దాన్ని సుధీర్ నిలబెట్టుకోలేకపోయాడు. 

సమ్మోహనం తర్వాత పది సినిమాల్లో నటిస్తే ‘నన్ను దోచుకుందువటే’ మాత్రమే ఓ మాదిరిగా ఆడింది. మిగతావన్నీ ఫ్లాపులే. అందులోనూ గత మూణ్నాలుగేళ్లలో సుధీర్ బాబుకు మామూలు షాకులు తగల్లేదు. ‘మామా మశ్చీంద్ర’ తన కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాగా నిలిచింది. ‘హరోం హర’, ‘మా నాన్న సూపర్ హీరో’ మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఆడలేదు. తాజాగా ‘జటాధర’ సినిమా సుధీర్ కెరీర్‌ను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిపోయింది.

ఎవరైనా కష్టాల్లో ఉంటే దేవుడే దిక్కు అంటారు. కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న సుధీర్.. దేవుడినే నమ్ముకున్నాడు. ట్రెండుకు తగ్గట్లుగా దేవుడు-దయ్యం కాన్సెప్ట్‌తో ‘జటాధర’ చేశాడు. కానీ సుధీర్‌ను దేవుడు కూడా కాపాడలేకపోయాడు.  ట్రైలర్ చూసి ఏదో అనుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు మామూలు షాక్ తగల్లేదు. సుధీర్ కెరీర్లో అట్టడుగున నిలవడానికి బలమైన పోటీదారుగా మారిందీ చిత్రం. అంతగా టార్చర్ పెట్టిన సినిమా ఇది. 

ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ లేవు. వీకెండ్లోనే సినిమా వాషౌట్ అయిపోయింది. ఈ సినిమా చూశాక సుధీర్ కెరీర్ ఇక పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన జడ్జిమెంట్ మీదా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ స్థితిలో సుధీర్ సినిమాలకు ఓ మోస్తరు బడ్జెట్లు పెట్టడం.. వాటిని మార్కెట్ చేయడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో సుధీర్ తన తర్వాతి సినిమా చేయాల్సి ఉంది. మరి ‘జటాధర’ షాక్ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ముందుకు కదిలి సుధీర్‌‌కు అవసరమైన బ్రేక్ లభిస్తుందా అన్నది చూడాలి.

Related Post

కాంగ్రెస్ వ‌దుల‌కుంది.. మోడీ ఓన్ చేసుకున్నారు!కాంగ్రెస్ వ‌దుల‌కుంది.. మోడీ ఓన్ చేసుకున్నారు!

రాజ‌కీయాల్లో ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థులు దానిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల్లో 2014 త‌ర్వాత అనేక మార్పులు సంత‌రించుకున్నాయి. ప్ర‌ధాని పీఠంపై కూర్చున్న న‌రేంద్ర‌ మోడీ.. వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు.

కల్తీ లడ్డు వివాదం: ప్రజలకు పిలుపునిచ్చిన పవన్కల్తీ లడ్డు వివాదం: ప్రజలకు పిలుపునిచ్చిన పవన్

మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. సిట్ నివేదికను వైసీపీ తప్పుదారి పట్టిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోందని కూటమి

5 Telugu and Tamil Films to Watch on OTT This Week: Vemal’s Mahasenha to social satire drama Dhandoraa5 Telugu and Tamil Films to Watch on OTT This Week: Vemal’s Mahasenha to social satire drama Dhandoraa

Cast: Sivaji, Manika Chikkala, Mounika Reddy, Navdeep, Bindu Madhavi, Ravi Krishna Thota Director: Muralikanth Devasoth Genre: Social Satire Drama  Language: Telugu Runtime: 2 hours and 16 minutes Where to watch: