hyderabadupdates.com movies సుహాస్‌ను అవమానించిందెవరు?

సుహాస్‌ను అవమానించిందెవరు?

ముందు క్యారెక్టర్ రోల్స్ చేశాడు. తర్వాత హీరోగా మారి ‘కలర్ ఫొటో’తో మెప్పించాడు. అప్పట్నుంచి వరుసగా లీడ్ రోల్స్‌లో సినిమాలు చేస్తున్నాడు. దాంతో పాటు అప్పుడప్పుడూ క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్‌లోనూ మెరుస్తున్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్థాయికి చేరుకున్న తన ప్రయాణం స్ఫూర్తిదాయకం.

ఐతే ఇలా కష్టపడి ఎదిగిన ఆర్టిస్టులకు కెరీర్ ఆరంభంలో కొన్ని చేదు అనుభవాలు తప్పకుండా ఉంటాయి. తానూ అందుకు మినహాయింపు కాదంటున్నాడు సుహాస్. తనకు గతంలో ఎదురైన ఒక అవమానం గురించి తన కొత్త సినిమా ‘హే బల్వంత్’ ప్రమోషనల్ ఈవెంట్లో సుహాస్ వెల్లడించాడు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుహాస్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘మజిలీ’. ఆ సినిమాతో తన కెరీర్ మారిందని.. వరుసగా అవకాశాలు వచ్చాయని చెప్పిన సుహాస్.. ఒక సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం తనను పిలిస్తే అక్కడ ఎదురైన అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు.

‘హీరోయిన్‌కు చాలా క్లోజ్‌గా ఉండే క్యారెక్టర్, ఇతణ్నెందుకు పిలిచారు’ అంటూ అక్కడున్న ఓ వ్యక్తి తన ముందే అన్నట్లు సుహాస్ తెలిపాడు. అప్పుడు చాలా బాధ పడ్డానన్న సుహాస్.. కొన్నేళ్ల తర్వాత కీర్తి సురేష్, సుహాస్ కాంబినేషన్లో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా వచ్చిందని.. తన దృష్టిలో ఇదే పెద్ద సక్సెస్ అని చెప్పుకొచ్చాడు.

కీర్తి సురేష్‌కు తనతో పాటు తన భార్య కూడా పెద్ద అభిమాని అని.. ‘ఉప్పు కప్పురంబు’ సినిమా షూట్ తొలి రోజు ఆమె తనను ‘హాయ్ సుహాస్’ అని పలకరించి, హగ్ ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు సుహాస్.

ఆ షూట్ జరిగినన్ని రోజులు తన భార్య అనేక రకాల వంటలు చేసి పంపేదని.. అవి కీర్తి సురేష్‌కు వడ్డించేవాడినని సుహస్ తెలిపాడు. కీర్తి గురించి ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం చూస్తే.. గతంలో అతడికి అవమానం ఎదురైంది కీర్తి నటించిన సినిమానే అయ్యుండొచ్చనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఆ చిత్రం ఏదో?

Related Post

తండ్రినే డామినేట్ చేసిన హృతిక్ తనయులుతండ్రినే డామినేట్ చేసిన హృతిక్ తనయులు

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ డ్యాన్సర్ల లిస్టు తీస్తే.. అగ్ర స్థానానికి గట్టి పోటీదారుగా ఉంటాడు హృతిక్ రోషన్. తన తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే అతను టాప్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందులో ఇక్‌బల్ కా జీనా స్టెప్పులకు

ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లుకు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే మిగిలి ఉంది. ఇది కూడా త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. ఎలానూ చ‌ట్ట‌బ ద్ద‌త వ‌చ్చేసిన‌ట్టే కాబ‌ట్టి..