hyderabadupdates.com movies సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే..ఇంకా ఉన్నాయి: చంద్రబాబు

సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే..ఇంకా ఉన్నాయి: చంద్రబాబు

ప్రపంచ దేశాలలో అత్యంత శక్తిమంతమైన ప్రధానులల ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక వైపు…భారత దేశంలోని రాష్ట్రాలలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు…ఇటువంటి డెడ్లీ కాంబినేషన్ ఉంటే ఇటు రాష్ట్రం..అటు కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయం. డేరింగ్ అండ్ డ్యాషింగ్ పీఎం మోదీ, విజనరీ సీఎం చంద్రబాబుల కాంబోలో నవ్యాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.

మనందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని ఆయన అన్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని చెప్పుకొచ్చారు. పాతికేళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, పీఎంగా మోదీ ఉన్నారని కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందని, ఈ విషయంలో సందేహం లేదని చెప్పారు. సరైన సమయంలో మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం అదృష్టమని అన్నారు.

మోదీ మాదిరి నిర్విరామంగా నిరంతరం పనిచేసే ప్రధానిని తాను చూడలేదని, 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి భారత్ చేరిందని ప్రశంసించారు. జీఎస్టీ తగ్గింపుతో 99శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి డబుల్ బెనిపిట్ వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ అందాయని అన్నారు.

Related Post

అన్న హీరో.. చెల్లి నిర్మాత‌.. ప‌వ‌న్ గెస్ట్?అన్న హీరో.. చెల్లి నిర్మాత‌.. ప‌వ‌న్ గెస్ట్?

ఓ మంచి హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వ‌రుణ్ తేజ్. ఒక ద‌శ‌లో తొలి ప్రేమ‌, ఎఫ్‌-2 లాంటి విజ‌యాల‌తో మంచి ఊపు మీదa క‌నిపించిన అత‌ను.. త‌ర్వాత ట్రాక్ త‌ప్పాడు. త‌న చివ‌రి చిత్రం

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితంఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం దక్కిందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వర్మ… నియోజకవర్గంపై తనదైన శైలి పట్టు సాధించారు. పిఠాపురంలో టీడీపీ తరఫున