hyderabadupdates.com movies సూర్య ప్లాన్ మారింది తెలుగు కోసమే

సూర్య ప్లాన్ మారింది తెలుగు కోసమే

హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే సూర్య మీద తెలుగు తమిళ ప్రేక్షకుల్లో ఒక గౌరవముంది. కాకపోతే ఆ నమ్మకాన్ని బలపరిచే స్థాయిలో హిట్లు పడటం లేదు. కంగువ మరీ అన్యాయంగా ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్న ఈ విజువల్ గ్రాండియర్ ని ఒక్క పార్ట్ తోనే సరి పుచ్చేశారు. దీని ప్రభావం సూర్య కొత్త మూవీ కరుప్పు మీద పడుతోంది. షూటింగ్ ఆలస్యంతో పాటు థియేటర్ బిజినెస్, ఓటిటి డీల్స్ వల్ల విడుదల తేదీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఫైనల్ గా జనవరి 23 లాక్ చేసినట్టుగా చెన్నై టాక్. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ సూర్య ఫ్యాన్స్ డిమాండ్ వేరే ఉంది.

కరుప్పు కమర్షియల్ సినిమానే అయినప్పటికీ మంచి డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు గ్రామ దేవతలకు సంబంధించిన బలమైన అంశాలు దర్శకుడు ఆర్జె బాలాజీ జోడించాడు. ఇలాంటి వాటికి సంక్రాంతి బెస్ట్ సీజన్. ఆరవ ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. కానీ సూర్య వద్దని చెప్పాడట. ఎందుకంటే తెలుగుతో పాటు సమాంతరంగా రిలీజ్ చేయాల్సిన నేపథ్యంలో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, శివ కార్తికేయన్, విజయ్ అందరికీ థియేటర్లు సర్దుబాటు చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది కరుప్పు వస్తే ఈ పోటీలో నలిగిపోవడం ఖాయం. అందుకే వద్దన్నాడట.

సో రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుని కరుప్పు రాబోతోంది. నిజానికి విజయ్ జన నాయకుడుకి జంకి పొంగల్ కి రావట్లేదేమోనని యాంటీ ఫ్యాన్స్ అనుకున్నారు కానీ దాంట్లో నిజం లేదట. పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండటంతో హడావిడి వద్దని అనుకున్నారు. అర్థం కానీ కరుప్పు టైటిల్ తెలుగులో మార్చమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఏ మేరకు వింటారో చూడాలి. కార్తీ అయితే తన వా వాతియర్ ని అన్నగారు వస్తారుగా మార్పించి మంచి పని చేశాడు. మరి తమిళ వాసన గుప్పున కొడుతున్న కరుప్పుకి ఒరిజినల్ పేరే పెడతారో లేక తెలుగు వరకు మారుస్తారో చూడాలి.

Related Post

క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యంక్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్ల‌మెంటులోని హోం శాఖ కార్యాల‌యంలో రాష్ట్ర మంత్రి అనిత‌, పార్టీ పార్ల‌మెంట‌రీ నాయ‌కుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు

నా కేసు క్లోజ్ చెయ్యడానికి 25 ఏళ్ళా… స్టార్ హీరో అసహనంనా కేసు క్లోజ్ చెయ్యడానికి 25 ఏళ్ళా… స్టార్ హీరో అసహనం

90వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు దాచిపెట్టిన కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ అరెస్టవడం.. ఆ కేసు సుదీర్ఘ కాలం విచారణ దశలో ఉండడం.. కొన్నేళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకుని 2016లో