hyderabadupdates.com movies సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు

సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం వైద్యం కోసం మానుకోట జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అయితే.. అతడి వద్ద ఆధార్ కార్డు లేకపోవటంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల పాటు ఆసుపత్రి క్యాంటీన్ ఆవరణలోనే ఉండిపోయాడు.

ఆసుపత్రి సిబ్బంది తనను కరుణించి.. వైద్యం చేస్తారని భావిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఎలాంటి వైద్య సాయం అందకపోవటం.. ఆహారం అందకపోవటంతో నీరసించిపోయాడు. క్యాంటీన్ ఆవరణలోనే స్ర్పహ తప్పిపోయాడు. అచేతన స్థితిలో ఉన్న రాజును చూసి అతడు మరణించినట్లుగా భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవటంతో అతడ్ని మార్చురీ ప్రాంగణంలో గేట్ వద్ద ఉంచేశారు. తర్వాతి రోజు మార్చురీ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది బాధితుడిలో కదలికల్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే అత్యవసర వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు.

Related Post

‘బాహుబలి: ది ఎపిక్’ను వాళ్లు ఓన్ చేసుకోలేదా?‘బాహుబలి: ది ఎపిక్’ను వాళ్లు ఓన్ చేసుకోలేదా?

‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలను థియేటర్లలో, టీవీల్లో ఓటీటీల్లో ఎన్నోసార్లు చూసినా సరే.. ఈ రెండు చిత్రాలనూ కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తే మళ్లీ ఎగబడి చూస్తున్నారు మన ప్రేక్షకులు. అమెరికా నుంచి

Sunny Deol abuses the media over Dharmendra’s health rumorsSunny Deol abuses the media over Dharmendra’s health rumors

Sunny Deol lost his composure on Tuesday after sections of the media gathered outside his residence, taking pictures and spreading false rumors about his father, Dharmendra’s, health. Reports of Dharmendra’s