hyderabadupdates.com movies సౌదీ బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు ఇతనే..

సౌదీ బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు ఇతనే..

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో 8 మంది మృతిని చెందగా వారిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని పేరు షేక్ అబ్దుల్ షోయబ్. ప్రమాద సమయంలో అతను బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నాడు. షోయబ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 46 మందితో ప్రయాణిస్తున్న ఆ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 45 మంది మరణించారు. 

ప్రముఖుల దిగ్ర్భాంతి 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సీఎం సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తన సంతాపాన్ని తెలిపారు. సౌదీ అరేబియాలో జరిగిన దారుణ ప్రమాదంలో ఉమ్రా యాత్రకు వెళ్లిన తెలంగాణకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయిన విషాద వార్త హృదయాన్ని కలచివేసిందన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సౌదీ అరేబియా దేశంలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరం అన్నారు. మృతి చెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్ కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసిందన్నారు. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related Post