hyderabadupdates.com movies స్పిరిట్ అభిమానుల కొత్త డిమాండ్

స్పిరిట్ అభిమానుల కొత్త డిమాండ్

ప్రభాస్ అభిమానులు స్పిరిట్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. దీనికన్నా ముందు ఫౌజీ వస్తుందని తెలిసినా కూడా సందీప్ రెడ్డి వంగా అప్డేట్స్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద ఎగ్జైట్ మెంట్ కేవలం ఫ్యాన్స్ లోనే కాదు సగటు మూవీ లవర్స్ లోనూ విపరీతంగా ఉంది.

అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న మరో కీలక విషయం ఉంది. అదే ప్రముఖ  కొరియన్ నటుడు డాన్లీ ఇందులో ఉన్నాడా లేదాని. అసలీ సినిమా మొదలుపెట్టక ముందు నుంచే డాన్లీ ఉన్నాడనే లీక్ విపరీతంగా చక్కర్లు కొట్టింది. పలు ఇంటర్వ్యూలలో సందీప్ నే కొందరు అడిగినా ఉన్నాడని, లేడని చెప్పకుండా స్మార్ట్ గా తప్పించుకున్నాడు.

ఇటీవలే వివేక్ ఒబెరాయ్ లుక్ విడుదలయ్యింది. మాములుగా అయితే ఇది క్రేజీ న్యూస్. కానీ డార్లింగ్ అభిమానులు జస్ట్ ఓకే అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూసింది డాన్లీ కోసం కాబట్టి. యానిమల్ కోసం బాబీ డియోల్ లాంటి సర్ప్రైజ్ విలన్ ని తీసుకొచ్చి షాక్ ఇచ్చిన సందీప్ వంగా ఈసారి కూడా అదే చేస్తారని జనం భావించారు.

కానీ వివేక్ లాక్ కావడం ఊహించని ట్విస్ట్. ఎందుకంటే తను మనకేం కొత్త కాదు. వినయ విధేయ రామలో చేశాడు. రక్త చరిత్ర రెండు భాగాల్లో నటించాడు. సో కొత్త ఫేస్ అనిపించదు. అందుకే స్పిరిట్ లో తను ఉన్నాడనేది సెన్సేషన్ కాలేకపోయింది. అందులోనూ ప్రభాస్ బర్త్ డే సందర్భంలోనే వివేక్ పేరుని ప్రకటించేశారు.

ఒకవేళ డాన్లీ లేకపోయినా అదేదో కాస్త ముందుగా క్లారిటీ ఇస్తే బెటర్. ఎందుకంటే సోషల్ మీడియా జనాల ఫోకస్ డాన్లీ మీద ఉండటం మంచిది కాదు. స్పిరిట్ చాలా విషయాల్లో హైలైట్ అవ్వాలి. అంతే తప్ప ఒక విదేశీ నటుడి కోసం ట్రెండింగ్ కావడం సేఫ్ కాదు. సందీప్ ఇది గుర్తించి ఈ పుకార్లకు చెక్ పెడితే ఇతర అంశాలు హైలైట్ అవుతాయి.

ప్రస్తుతం ఫౌజీలో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో కల్కి 2 సెట్స్ లో అడుగు పెట్టాలి. స్పిరిట్ టైంలో వేరేవి చేయకూడదనే నిబంధనని ప్రభాస్ ఫాలో కాలేకపోతున్నాడు. డెడ్ లైన్స్, షెడ్యూల్స్ టైట్ అయిపోవడం లాంటి కారణాలు తనను ఏం చేయలేని పరిస్థితిలో నెట్టేశాయి.

Related Post

బీహార్ దంగ‌ల్‌: `65 వోల్టుల` షాక్ ఎవ‌రికి?బీహార్ దంగ‌ల్‌: `65 వోల్టుల` షాక్ ఎవ‌రికి?

దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు, అటు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి, ఇటు ఎన్డీయే కూట‌మికి కూడా.. పెను స‌వాలు గా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల రెండో ద‌శ పోలింగ్‌కు ఆదివారం(న‌వంబ‌రు 9) సాయంత్రం తెర‌ప‌డనుంది. ఈ రాష్ట్రంలో మొత్తంగా 243 అసెంబ్లీ

జన నాయకుడికి చిక్కులు తప్పవాజన నాయకుడికి చిక్కులు తప్పవా

ఇటీవలే తమిళనాడు రాష్ట్రం కరూర్ లో విజయ్ రాజకీయ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలభై ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డ్యామేజ్ ని తగ్గించే ఉద్దేశంతో విజయ్