hyderabadupdates.com movies హాట్ టాపిక్‌: ఏపీ 2025 రాజ‌కీయాలు ఇవే… !

హాట్ టాపిక్‌: ఏపీ 2025 రాజ‌కీయాలు ఇవే… !

2025 సంవత్సరంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏ విధంగా స్పందిస్తున్నారు? అనేది ఆసక్తికర విషయం. రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్న విషయాన్ని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. తద్వారా కూటమి బలాన్ని తగ్గకుండా అదేవిధంగా ప్రజల్లో జోష్ తగ్గకుండా కూడా చూస్తున్నారు.

కోటమిగా ఉంటేనే విజయం దక్కించుకుంటామని చంద్రబాబు కూడా పార్టీ నాయకులతో చెబుతూ వస్తున్నారు. 2025 రాజకీయాల్లో తీసుకుంటే ఈ పరిణామం ఎక్కువగా కనిపించింది. ఇదే సమయంలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పని చేయాలన్న సంకేతాలను రెండు పార్టీల నాయకులు బలంగా పంపిస్తున్నారు. మరోవైపు గతానికి భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కూట‌మికి బలాన్ని చేకూర్చే విధంగా బిజెపి నాయకులు ఉండాలని సూచించారు. ఇది ఈ ఏడాది జరిగిన కీలక పరిణామం.

మోడీ చేసిన కీలక ప్రతిపాదన కూటమిలో బలాన్ని పెంచిందని చెప్పాలి. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తరచుగా కూటమి బలంగా ఉంటుందని క్షేత్రస్థాయిలో నాయకులు కలిసి మెలిసి ఉండాలని సూచిస్తున్నారు. ఇక వైసిపి విషయానికి వస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం త‌మ‌దేన‌ని చెబుతూ వస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పార్టీ విజయం ఖాయమని జ‌గ‌న్‌ భరోసా కల్పిస్తున్నారు,

2025 రాజకీయాల్లో ఈ రెండు రాజకీయ వర్గాలు(కూట‌మి-వైసీపీ) కూడా తమ తమ పార్టీ కార్యకర్తలను నాయకుల‌ను కాపాడుకునే దిశగా.. వారిలో ఉత్తేజాన్ని పెంచే దిశగా అడుగులు వేశాయని చెప్పాలి. ఇదే వ్యవహారం సాధారణ ప్రజల్లోనూ చర్చగా మారింది. మొత్తంగా 2025లో రాజకీయాలు పెద్దగా మార్పు అయితే కనిపించలేదు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరిని మార్చుకోలేదు. కూటమి ప్రభుత్వానికి కూడా తమ ఐక్యత బలంగా ఉందని చాటి చెప్పుకోవడంలో విజయవంతం సాధించింది.

Related Post

Vishnu Vishal’s ‘Aaryan’ teaser promises a dark and gripping crime thrillerVishnu Vishal’s ‘Aaryan’ teaser promises a dark and gripping crime thriller

The teaser of Vishnu Vishal’s upcoming crime thriller ‘Aaryan’ has been released, offering audiences a gripping glimpse into a dark, psychological battle between a cop and a serial killer. Directed

Fresh Romantic Film Launched: Sangeeth Shobhan Teams Up with Promising TalentFresh Romantic Film Launched: Sangeeth Shobhan Teams Up with Promising Talent

A new romantic entertainer featuring young actor Sangeeth Shobhan officially went on floors today with a traditional pooja ceremony in Hyderabad. The actor, who earned strong youth following with MAD