hyderabadupdates.com Gallery హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఆశించిన దానికంటే అద్బుతంగా ఆడింది. ప్రేక్ష‌కుల మన‌సు దోచుకుంది. గుండెల‌ను హ‌త్తుకునేలా ఉండ‌డంతో జ‌నం ఆద‌రించారు. ఇది తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన నిజ‌మైన క‌థ‌. ఈ సినిమా పాట‌లు కూడా బిగ్ హిట్ గా నిలిచాయి. సినిమా స‌క్సెస్ కు అస్సెట్ గా మారాయి.
తాజాగా వేణు ఉడుగుల సంచ‌ల‌నంగా మారాడు. త‌ను కొత్త‌గా హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వెళ‌తున్న‌ట్లు తెలిపాడు. ఇవాళ ఆయ‌న మీడియాతో త‌న కొత్త ప్రాజెక్టు గురించి పంచుకున్నాడు. ఇక హ‌రింద‌ర్ ఎస్ సిక్కా ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత‌. త‌ను రాసిన కాలింగ్ సెహ‌మ‌త్ సూప‌ర్ స‌క్సెస్ గా నిలిచింది. ఇందులో అందాల తార ఆలియా భ‌ట్ న‌టించింది. మేఘనా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.
ఈ చి్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత వేణు ఉడుగుల‌తో క‌లిసి కొత్త ప్రాజెక్టుకు ప‌ని చేయ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉండ‌గా వేణు ఉడుగుల మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. సిక్కా ఇచ్చిన కథతో నా హిందీ దర్శకత్వ రంగ ప్రవేశం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఇది నిజంగా నాకు ఒక కలల ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
The post హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Red Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియోRed Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియో

    దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మురం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీ వీడియో బయటపడింది. ఎర్రకోట వద్ద కారు బాంబు

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలుDiwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు

Diwali : పండగల వేళ.. ముఖ్యంగా దసరా, దీపావళి వేళ.. తమ సంస్థ ఉద్యోగులకు స్వీట్లు అందజేస్తాయి యాజమాన్యం. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో దీపావళీకి మిఠాయి షాపుల్లో స్వీట్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. అలాగే