hyderabadupdates.com movies హీరో విశాల్… పది కోట్లు కట్టు – కోర్టు ఆదేశం

హీరో విశాల్… పది కోట్లు కట్టు – కోర్టు ఆదేశం

తెలుగు వాడైన తమిళ హీరో విశాల్‌ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుంటాడు. తన నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లతో అతడికి చాలా గొడవలే ఉన్నాయి. ఐతే వాటిలో ఒక వివాదం చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. ఆ వ్యవహారం కోర్టుకు కూడాా వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మద్రాస్ హైకోర్టు.. విశాల్‌పై సీరియస్ అయింది. వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించింది. లేదంటే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి వివరాలేంటో చూద్దాం.

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బు చెళియన్ గతంలో ఒక సినిమా కోసమని విశాల్‌కు రూ.21 కోట్ల రుణం ఇచ్చాడు. ఆ తర్వాత వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఐతే ఇందుకు గాను విశాల్ నటించే సినిమాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని లైకా షరతు విధించింది. కానీ విశాల్ అలా చేయలేదు. పైగా రుణాన్ని లైకాకు తిరిగి ఇవ్వలేదు. దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కొన్నేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.

ఇటీవల మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ ఈ కేసు విషయంలో లైకా సంస్థకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. రూ.21 కోట్ల రుణానికి 30 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై విశాల్ అప్పీల్‌కు వెళ్లాడు. దీనిపై విచారణ సందర్భంగా.. తమ క్లైంట్ అంత డబ్బు కట్టేంత ధనవంతుడు కాదని విశాల్ లాయర్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. విశాల్ ధనవంతుడు కాకపోతే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని పేర్కొంది. వెంటనే ఈ కేసుకు సంబంధించి రూ.10 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు విశాల్‌ను ఆదేశించింది.

Related Post

డిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూడిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూ

మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి, దురంధర్ ఏదో నెట్టుకొస్తున్నాయి కానీ చాలా స్క్రీన్లు తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. ఫీడింగ్ కోసం తేరే ఇష్క్ మే డబ్బింగ్

ప్రభుత్వ ఉద్యోగులూ… ఇకపై క్యాంటీన్ లో కబుర్లు ఒద్దుప్రభుత్వ ఉద్యోగులూ… ఇకపై క్యాంటీన్ లో కబుర్లు ఒద్దు

ఏపీలో ఉద్యోగులు అలెర్ట్ కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వ‌చ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో పాల‌న‌ను సంస్క‌రిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం ఆదిశ‌గా చేయాల్సిన ముంద‌స్తు ప‌నుల‌ను వేగంగా అమ‌లు చేయాలని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల స‌మ‌య పాల‌న‌తోపాటు.. ఫైళ్ల క్లియ‌రెన్స్