hyderabadupdates.com movies హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?

హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర మామూలు విధ్వంసం సాగించట్లేదు. ఇది సగటు ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినప్పటికీ.. చిరును వింటేజ్ స్టయిల్లో చూపించడం.. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే ఎంటర్టైన్మెంట్ ఉండడం బాగా కలిసొచ్చి సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. రీఎంట్రీలో చిరును ది బెస్ట్‌గా చూపించిన చిత్రం ఇదే. 

70 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ తనదైన శైలిలో వేసిన స్టెప్పులు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. మెగా ఫ్యాన్స్ ఆ స్టెప్పులు చూసి మైమరిచిపోయారు. ఒకప్పటంత స్పీడు లేకపోయినా.. గ్రేస్ విషయంలో మాత్రం మెగాస్టార్ తన మార్కు చూపించారు. ముఖ్యంగా రిలీజ్ ముంగిట ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘హుక్ స్టెప్’ సినిమాకు మాంచి హైప్ తీసుకొచ్చింది. తెర మీదా ఈ స్టెప్ బాగా పేలింది. థియేటర్లలో సంబరాలు తీసుకొచ్చింది.

ఐతే ఈ హుక్ స్టెప్‌ను కంపోజ్ చేసిన ‘ఆట’ సందీప్‌తో పాటు కొరియోగ్రఫీ టీం మొత్తం.. ఈ డ్యాన్స్ మూమెంట్‌కు లీడ్ ఎలా ఇవ్వాలో తెలియక సెట్లో తలలు పట్టుకుందట. అందుకోసం రకరకాల స్టెప్స్ ట్రై చేసిందట. కానీ ఏదీ కుదరలేదట. వాళ్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దూరం నుంచి చూస్తున్న చిరు.. తనే దగ్గరికి వచ్చి హుక్ స్టెప్‌కు ముందు లీడ్ ఎలా ఉండాలో తనే చేసి చూపించాడట. అది కొరియోగ్రాఫర్‌తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా బాగా నచ్చేసి దాన్నే ఫిక్స్ చేశారట. 

అలా హుక్ స్టెప్‌కు ముందు చిరు మూమెంట్స్ అన్నీ ఆయనే స్వయంగా కంపోజ్ చేసుకున్నారట. దీని కోసం తాను రిహార్సల్స్ కూడా ఏమీ చేయలేదని.. అప్పటికప్పుడు అనిపించింది చేసేశానని.. ఒక్క టేక్‌లో అది ఓకే అయిపోయిందని చిరు.. అనిల్, వెంకటేష్‌లతో కలిసి చేసిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 70 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్ విషయంలో చిరు ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలిసి అభిమానులు మెస్మరైజ్ అయిపోతున్నారు.

Related Post

అఖిల్ VS ధృవ్ – ఒకే బస్సులో ప్రయాణంఅఖిల్ VS ధృవ్ – ఒకే బస్సులో ప్రయాణం

స్టార్ హీరోల వారసులు ఆ లెగసిని మోయడం అంత సులభంగా ఉండదు. లేనిపోని ఒత్తిడి తీసుకుంటే ఫలితాలు తేడా కొట్టడమే కాదు ఏకంగా కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. అక్కినేని మూడో తరం నుంచి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇండస్ట్రీలో ఎంటరై

Sangeeth Sobhan’s Next Move… After ‘Raakaasa’ Success, Teams Up with PranaySangeeth Sobhan’s Next Move… After ‘Raakaasa’ Success, Teams Up with Pranay

Young actor Sangeeth Sobhan, who is currently riding high on back-to-back hits, is all set for an exciting new collaboration. Following the success of his recent hit Raakaasa, the actor