hyderabadupdates.com movies హైట్ వ‌ల్ల అకీరాను ఓజీలోకి తీసుకోలేదా?

హైట్ వ‌ల్ల అకీరాను ఓజీలోకి తీసుకోలేదా?

రాబోయే రోజుల్లో టాలీవుడ్లో అత్యంత ఆస‌క్తి రేకెత్తించే అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడైన ఈ కుర్రాడు.. సినిమాల్లోకి అడుగు పెట్ట‌క‌ముందే బంప‌ర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నేళ్లుగా త‌న పుట్టిన రోజు వ‌స్తే సోష‌ల్ మీడియా హోరెత్తిపోతోంది. ఆ స్థాయిలో అభిమానులు త‌న పేరును ట్రెండ్ చేస్తున్నారు. అకీరా ఎప్పుడైనా బ‌య‌టికి వ‌స్తే త‌న పొటోలు వైర‌ల్ అయిపోతున్నాయి. ఇప్పుడే ఇంత క్రేజ్ తెచ్చుకున్న అకీరా.. ఇక సినిమాల్లోకి వ‌స్తే ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. త‌న అరంగేట్రం కోసం మెగా అభిమానులు అంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

హీరోగా చేయ‌డానికి ముందే ఓజీ సినిమాలో అకీరా క్యామియో రోల్ చేస్తున్న‌ట్లుగా విడుద‌ల ముంగిట జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఐతే అది నిజం కాలేదు. కానీ అకీరాను ఇందులో న‌టింప‌జేసే విష‌యం గురించి టీంలో చ‌ర్చ జ‌రిగింద‌ట‌. ఈ విష‌యాన్ని సినిమాలో యంగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రోల్‌లో క‌నిపించిన ఆకాష్ శ్రీనివాస్ అనే కుర్రాడు ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

ఓజీలో యంగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీన్ కాసేపే ఉన్నా అభిమానుల‌కు మంచి కిక్కిచ్చింది. ఈ పాత్ర‌ను అకీరా చేసి ఉంటే పేలిపోయేద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మయ్యాయి. ఈ పాత్ర చేసిన ఆకాష్‌కు కూడా ఇదే ఫీలింగ్ క‌లిగింద‌ట‌. ఆ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు సుజీత్‌తో కూడా చెప్పాడ‌ట‌. ఐతే ఈ పాత్రను అకీరాతో చేయించ‌డానికి త‌న హైటే స‌మ‌స్య అని సుజీత్ చెప్పాడ‌ట‌.

అకీరా దాదాపు ఆరున్న‌ర అడుగుల ఎత్తుంటాడు. తండ్రి కంటే అత‌ను చాలా పొడ‌వు. అలాంట‌పుడు కుర్రాడిగా ఉన్న ఓజాస్ గంభీర అంత హైట్ ఉండి.. పెద్ద‌య్యాక పొడ‌వు త‌గ్గిపోతే లాజిక్ మిస్సవుతుంది క‌దా? ఆ ఉద్దేశంతోనే అకీరాతో ఆ పాత్ర చేయించ‌లేద‌ని సుజీత్‌ ఆకాష్‌కు చెప్పాడ‌ట‌. అకీరా ఆ క్యామియో చేస్తే బాగుండేది కానీ.. త‌న అరంగేట్రానికి ఇది స‌రైన సినిమా కాద‌న్న‌ది మెజారిటీ అభిమానుల మాట‌. అత‌ను ఫుల్ లెంగ్త్ హీరోగానే ఎంట్రీ ఇవ్వాల‌ని వారు కోరుకుంటున్నారు. ఇంకో రెండు మూడేళ్ల త‌ర్వాత త‌న డెబ్యూ మూవీ తెర‌పైకి రావ‌చ్చేమో.

Related Post

Box Office: Rishab Shetty’s divine Hit Kantara completes 50 Days, nets Rs 208 crore in HindiBox Office: Rishab Shetty’s divine Hit Kantara completes 50 Days, nets Rs 208 crore in Hindi

Rishab Shetty’s Kantara: Chapter 1 completed 50 days in cinemas yesterday. The mythological epic saga, directed by Rishab himself, earned a whopping Rs. 208.25 crore from the Hindi version during