hyderabadupdates.com Gallery హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పై క‌విత క‌న్నెర్ర‌

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పై క‌విత క‌న్నెర్ర‌

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పై క‌విత క‌న్నెర్ర‌ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సీరియ‌స్ అయ్యారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ లోని సంస్థ కార్యాల‌యంలో క‌విత మీడియాతో మాట్లాడారు. త‌న‌పై ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేస్తాన‌ని, కోర్టుకు ఈడుస్తాన‌ని మండిప‌డ్డారు. ఆదిత్య కన్ స్ట్రక్షన్ కబ్జాకు పాల్పడుతోందని నువ్వే గతంలో లెటర్ రాశావని , ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. అవే ఆరోపణలతో నేను ధర్నా చేస్తే బద్నాం చేస్తావా అని భ‌గ్గుమ‌న్నారు. తప్పుడు సమాచారంతో ట్విట్టర్ లో వీడియోలు పెడితే ఎలా అని ఫైర్ అయ్యారు క‌విత‌. వాటిని తొల‌గించక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. అప్పుడు నీ ప్రభుత్వం, నువ్వు దూకి చావాలన్నారు. నిజం మాట్లాడిన వాళ్లనే బద్నాం చేస్తారా అని నిప్పులు చెరిగారు.
మీరు, మీ ప్రభుత్వం గ్రాఫిక్స్ డిజైనర్లా? కంటెంట్ క్రియేటర్లా? అంటూ ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన అనేది ప్రజలకు మంచి జరిగేలా ఉండాలే త‌ప్పా ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్టేలా ఉండ కూడ‌ద‌న్నారు. మూసీ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ కు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గతంలోనే చెప్పామ‌న్నారు క‌విత‌. మొన్నటి ప్రజెంటేషన్ లో ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తామని చెప్పలేద‌ని అన్నారు. గత ప్రభుత్వంలో మూసీ రివర్ బెడ్ లో నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఇవ్వడానికి కారణాలేంటి అని ప్ర‌శ్నించారు. పర్మిషన్ల వెనుక జరిగిన మాయాజాలం ఏంటీ? అని నిల‌దీశారు. వెలుగుమట్ల బాధితుల విషయంలో 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వారందరికీ మేలు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు.
The post హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పై క‌విత క‌న్నెర్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !

  మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. షియోపూర్‌ జిల్లా హల్పూర్‌ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన

PM Narendra Modi: భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీPM Narendra Modi: భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ

భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ   భూటాన్‌ సర్వతోముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భూటాన్‌ 13వ పంచవర్ష(2024–2029) ప్రణాళికకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోదీ భూటాన్‌ పర్యటన రెండో రోజు

మద్దతు ధర, ధరల స్థిరీకరణతో రైతుల‌కు భ‌రోసామద్దతు ధర, ధరల స్థిరీకరణతో రైతుల‌కు భ‌రోసా

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెట్ యార్డులు, రైతు బజార్లు, లింకు రోడ్ల అభివృద్ధి కోసం ఏంఎంసీల‌ ఆదాయం సరిపోక మార్కెట్ సెస్‌ను వరిపై