hyderabadupdates.com Gallery హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ post thumbnail image

హైద‌రాబాద్ : మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లో ప్ర‌జా అవ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూములు క‌బ్జాకు గురౌతున్నాయ‌ని వాటిని హైడ్రా కాపాడాల‌ని నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ప్ర‌గ‌తిన‌గ‌ర్ స్మ‌శాన‌వాటిక స్థ‌లం 5 ఎక‌రాల‌వ‌ర‌కూ ఉండ‌గా.. క‌బ్జాల‌కు గురౌతోంద‌ని స్థానికంగా నివాసం ఉంటున్న ఆలేటి శ్రీ‌నివాస రావు, జ‌శ్వంత్‌తో పాటు ప‌లువురు స్థానికులు వాపోయారు. స్మ‌శాన వాటిక‌ను ఆనుకునే చెత్త డంపింగ్ యార్డుకు కూడా కేటాయించిన స్థ‌లం దాదాపు 4 ఎక‌రాల వ‌ర‌కూ ఉన్న ప్ర‌భుత్వ భూమి కూడా క‌బ్జాల‌కు గురౌతోంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. స‌ర్వే అధికారులు కూడా నిర్ధారించార‌ని.. హైడ్రా వెంట‌నే రంగంలోకి దిగి కాపాడాల‌ని కోరారు. అలాగే బాచుప‌ల్లి పెద్ద‌కుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ ప‌రిధిలో శ్మ‌శాన వాటిక నిర్మిస్తున్నార‌ని.. కోర్టులో కేసు పెండింగ్ ఉన్న‌ప్ప‌టికీ నిర్మాణాలు ఆగ‌డం లేద‌ని శిఖ‌ర రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసింది.
శేరిలింగంప‌ల్లి మండ‌లం మ‌దీనాగూడ‌లోని పోచ‌మ్మ దేవాల‌యానికి చెందిన స్థ‌లంలో అపార్టు మెంటు క‌డుతున్నార‌ని.. గ్రామ‌స్తులు అడ్డుకోగా ఆగింద‌ని.. దీనిపై కోర్టుకు కూడా వెళ్లామ‌ని ప్రజావాణి ఫిర్యాదులో నివాసితులు ఫిర్యాదు చేశారు. న్యాయ‌స్థానంలో కేసు పెండింగ్ ఉన్నా అక్క‌డ అక్ర‌మ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని వారు ఆరోపించారు. ఇదే ప‌రిస్థితి అమీన్‌పూర్ స‌ర్వేనంబ‌రు 971లోని పోచ‌మ్మ‌కుంట‌లో కూడా స్మ‌శాన వాటిక‌ను నిర్మిస్తున్నార‌ని, ఈ చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిల‌ను కాపాడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు అందింది. మేడ్చ‌ల్ జిల్లా మేడిప‌ల్లి మండ‌లం బోడుప్ప‌ల్ ఎస్‌బీఆర్ కాల‌నీలో 25 ఫీట్ల ర‌హ‌దారిని 5 అడుగుల మేర ఆక్ర‌మించి షాపులు నిర్మించార‌ని.. దీంతో అంబులెన్స్‌లు, పాఠ‌శాల బస్సులు రాలేని ప‌రిస్థితి ఉంద‌ని ఎస్‌బీఆర్ కాల‌నీ సంక్షేమ సంఘం ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. ర‌హ‌దారిని ఆక్ర‌మించి నిర్మించిన ష‌ట్ట‌ర్ల‌ను తొల‌గించాల‌ని కోరారు.
The post హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీమెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీ

వ‌డోద‌ర : కీవీస్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రోసారి స‌త్తా చాటాడు ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వ‌య‌సులో 91 బంతుల్లో 93 ర‌న్స్ చేశాడు. మ్యాచ్ విజ‌యంలో కీల‌క

నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణంనిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించక పోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని

భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

అమెరికా : దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి భార‌త దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా త‌మ‌కు సుంకాలు చెల్లిస్తుంద‌ని, కానీ తాము వారికి ఎట్టి ప‌రిస్థితుల్లో చెల్లించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. శ‌నివారం ట్రంప్ మీడియాతో