hyderabadupdates.com Gallery అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు

అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు

అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు post thumbnail image

అమరావతి : అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా డేటా సెంటర్ విశాఖ నగరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ నగరాల సరసన చేరనుంది. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా 1 గిగావాట్ సామర్ధ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది.
కూటమి ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తుండటంతో గూగుల్ డేటా సెంటర్ సాకారం కానుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న సబ్ సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ తో వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజితో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం తీర ప్రాంతం కావడంతో అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంతో అనుకూలం. తర్లువాడ, అడవి వరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో, 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో మల్టీ-గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.
The post అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్యRohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

      ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులుPrashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Prashant Kishor : బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌కు (Prashant Kishor) ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో

మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలుమ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలు

న్యూఢిల్లీ : భారత దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆయ‌న విపక్షాల‌పై విరుచుకుప‌డ్డారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును అడ్డుకోవ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మాక‌కు 66