hyderabadupdates.com Gallery అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం post thumbnail image

హైద‌రాబాద్ : వేసవి కాలం ఆరంభ‌మైందని, నిప్పు రగిల్తే పెను ముప్పు తప్పదని, ఇలాంటి తరుణంలో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చ‌రించారు. బాచుప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారిలో రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ద‌గ్ధ‌మైన ఫ‌ర్నీచ‌ర్ దుకాణాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. అగ్ని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. ప‌క్క‌నే ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ ద‌గ్గ‌ర షార్టు స‌ర్క్యూట్ జ‌రిగి నిప్పు ర‌వ్వ‌లు రాలాయ‌ని.. అవి ఫ‌ర్నీచ‌ర్ దుకాణాల‌కు అంటుకుని మంట‌లు వ్యాపించాయ‌ని అక్క‌డి షాపుల నిర్వాహ‌కులు తెలిపారు. పైన క‌రెంటు తీగ‌లు వెళ్తున్నాయ‌ని.. అందులో ఒక తీగ తెగి మంట‌లు అంటుకున్నాయ‌ని మ‌రో దుకాణ నిర్వాహ‌కుడు చెప్పాడు.
అగ్ని ప్ర‌మాదాలు ఎందుకు జ‌రుగుతున్నాయి. అగ్ని ప్ర‌మాదాల‌కు ఆస్కారం ఉండే అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న ఉండ‌డం.. వాటి నివార‌ణ‌కు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అంద‌రూ అల‌వ‌ర్చుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. త‌నిఖీలు చేసినంత మాత్రాన అగ్ని ప్ర‌మాదాల‌ను నియంత్రించ‌లేమ‌ని.. ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అంద‌రూ పాటించిన‌ప్పుడే ఫ‌లితాలుంటాయ‌ని చెప్పారు. ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న ఆస్తులు ఒక్క ప్ర‌మాదంతో బూడిదౌతున్నాయ‌నే విష‌యం గ్ర‌హించాల‌ని అన్నారు. ఇక్క‌డ కూడా ఒక్కో దుకాణంలో రూ. 25 ల‌క్ష‌ల‌కు పైగా ఫ‌ర్నీచ‌ర్ ఉంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు… ఇది తీర‌ని న‌ష్ట‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు. 22 షాపుల‌కు పైగా బూడిద‌య్యాయి. న‌ష్ట‌ప‌రిహారం రెవెన్యూ విభాగం చూస్తుంద‌ని.. ప్ర‌మాదాలు మున్ముందు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. త‌నిఖీలతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోని వారిపై చ‌ర్య‌లు తీసుకునే అధికారం కూడా హైడ్రాకు క‌ట్ట‌పెట్టాల‌ని ప్ర‌భుత్వానికి నివేదించామ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.
The post అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లుKTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లు

  ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం నాగేందర్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు.

Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తాజ్ మహల్‌ను సందర్శించారు. సుమారు గంటసేపు తాజ్ ఆవరణలో గడిపారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆగ్రాకు చేరుకున్న ఆయన… అక్కడి డయానా బెంచ్‌ సహా

President Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముPresident Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద అర్చకులు ఆమెకు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున