hyderabadupdates.com Gallery అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌ post thumbnail image

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు. తామిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి, ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న ప్ర‌ద‌ర్శ‌న గురించి అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్బంగా యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ త‌నకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అభిషేక్ శ‌ర్మ‌కు ఎక్కువ‌గా ఉంద‌న్నాడు. ఇందులో ఎక్కువగా త‌న‌కు ఇండియ‌లోనే కాదు పాకిస్తాన్ లో అమ్మాయిలు త‌న‌ను ఎక్కువ‌గా అభిమానిస్తున్నార‌ని పేర్కొన్నాడు. తాజాగా శాంస‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండ‌గా ఐసీసీ టోర్నీలో తాను రాణించ‌డంపై కూడా స్పందించాడు. ఎందుక‌ని సెంచ‌రీలు చేసేందుకు ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఉప‌యోగించు కోలేద‌న్న ప్ర‌శ్న‌కు సూప‌ర్ స‌మాధానం ఇచ్చాడు. వ్య‌క్తిగ‌త రికార్డుల కంటే జ‌ట్టు విజ‌య‌మే ముఖ్య‌మ‌ని హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్ప‌ష్టం చేశాడ‌ని ఆ మేర‌కు తాను దేశం కోసం ఆడాన‌ని, సెంచ‌రీల గురించి తాను ఆలోచించ లేద‌న్నాడు సంజు శాంస‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో ఏనాడూ వ్య‌క్తిగ‌త మైల్ స్టోన్స్ గురించి ఆడ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక ఓపెనింగ్ పార్ట‌న‌ర్షిప్ గురించి కూడా స్పందించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు పొట్టి ఫార్మాట్ లో తామిద్ద‌రి కాంబో వ‌ర్క‌వుట్ అయ్యింద‌న్నాడు. ఇదే కంటిన్యూ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్.
The post అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎంగ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

అమ‌రావ‌తి : దేశంలో గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఏపీ మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . శ‌నివారం ఏపీలోని కాకినాడ‌లో ఏఎం గ్రీన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 15 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దిన‌క‌ర్పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దిన‌క‌ర్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌జా పాల‌న కొన‌సాగిస్తోంద‌న్నారు ఏపీ 20 సూత్రాల కార్య‌క్ర‌మాల అమ‌లు చైర్మ‌న్ లంకా దిన‌క‌ర్. శ‌నివారం శాస‌న స‌భ‌లో ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ 2026-2027 ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాంరాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాం

తాడేప‌ల్లి గూడెం : ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం