hyderabadupdates.com Gallery అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్ర‌సంగించారు. వివిధ అంశాల్లో జరిగిన ప్రగతిని ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాల్లో కొన్ని కీలక సూచనలు చేశారు. డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయ సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేస్తున్నాం అన్నారు. దీని కోసం మహిళా దినోత్సవం రోజున లోగోను కూడా ఆవిష్కరించాం అని తెలిపారు. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో… డ్వాక్రా ఉత్పత్తులకూ అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం.
అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అమూల్ పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తోందని చెప్పారు. స్వయంలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం ఉంద‌న‌న్నారు. బిలియన్ డాలర్ల కంపెనీకి ఉన్నంత క్రెడిబులిటీ డ్వాక్రా మహిళలకు ఉందన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారని ఆ న‌మ్మ‌కం నిజ‌మైంద‌న్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు వస్తాయన్నారు. ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుందన్నారు సీఎం. బ్రాండ్ లేకపోతే ఉత్పత్తి విలువ సగానికి తగ్గిపోతుందన్నారు. గ్లోబల్ మార్కెట్టుకు చేరేలా డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ ఉత్పత్తులకు ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ కూడా ఉండేలా చూడాలన్నారు.
The post అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమ‌లుస్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమ‌లు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, ప‌ర్మిష‌న్ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డబుల్ లైసెన్సింగ్ తరహా పద్దతులను తప్పించాలని

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కోసం భారీ ఏర్పాట్లుశ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కోసం భారీ ఏర్పాట్లు

తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. తిరుమలలో జరిగే

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకోరాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి నోరు విప్పారు. ఆయ‌న ఏబీఎన్ రాధాకృష్ణ‌పై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. సింగ‌రేణి టెండ‌ర్ల ర‌ద్దుపై