hyderabadupdates.com Gallery ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్

ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్

తిరుపతి : ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ విధానం అమ‌లు చేయాల‌ని అన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్, ఎస్వోపీ, అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం అధికారులతో టిటిడి ఈవో సింఘాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. టిటిడి అనుబంధ, స్థానిక ఆలయాల వార్షిక హుండీ ఆదాయం, ఖర్చులు ఎంత వస్తోంది, ఏ ఏ ఆలయాలకు బడ్జెట్ కు లోబడి ఖర్చులు అవుతున్నాయి, ఏఏ ఆలయాలలో ఆదాయానికి మించి ఖర్చులు అవుతున్నాయనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఇకపై ప్రతి ఆలయ నిర్వహణ కోసం ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయాల రోజు వారి నిర్వహణ, మరమ్మతులు తదితర సాధారణ ఖర్చులను కార్పస్ ఫండ్ కు వచ్చే వడ్డీ సొమ్ముతో ఖర్చు చేయాలని సూచించారు. పెద్ద స్థాయిలో మరమ్మతులు, వార్షిక ఉత్సవాల కోసం కేపిటల్ ఖర్చుగా భావించి టిటిడి నిధులతో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వచ్చే వేసవి నేపథ్యంలో టిటిడి ఆలయాలలో భక్తులకు వైద్యసేవలు, తాగునీరు, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టిటిడిలోని ఆలయాలలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు, కార్యక్రమాల నిర్వహణపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్ఓపీ) రూపొందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆలయానికి విరాళాలు ఇచ్చేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, ఎప్ఏఅండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
The post ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలుReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు

  గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో

Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ప్రచారం జోరందుకుంటోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సొంత నియోజకవర్గమైన రాఘోపుర్‌ నుంచి జన్‌సురాజ్‌ పార్టీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తేజస్వీ యాదవ్ పై ఆ పార్టీ

Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !

Children Hostage : ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్‌ పేరుతో కిడ్నాప్‌ కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌ తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ