ఇరాన్ : ఇరాన్ దేశానికి కోలుకోలేని షాక్ తగిలింది. నిన్నటి దాకా అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖతం అయ్యాడు. ఈ విషయాన్ని అటు ట్రంప్ ఇటు ఇరాన్ ధ్రువీకరించింది. 86 ఏళ్ల నాయకుడు శనివారం తెల్లవారుజామున తన కార్యాలయంలో హత్యకు గురయ్యారని తెలిపాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారని ఇరాన్ రాష్ట్ర మీడియా కూడా స్పష్టం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ బలిదానానికి చేరుకున్నారని రాష్ట్ర ప్రసార సంస్థ ఐఆర్ఐబీ ఆదివారం ప్రకటించింది. ఖమేనీ తన జీవితాన్ని ఇరాన్ దేశం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేశాడని ఆ దిశగా ఆయన పరలోకానికి వెళ్లి పోయాడని పేర్కొన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.
కాగా అంతకు ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ దేశాధినేత ఖతం అయ్యాడని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకటించింది. అతని మృత దేహం కూడా కనిపించిందని తెలిపింది. టెహ్రాన్‌లోని కాంపౌండ్ నుండి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు అతని మృతదేహం చిత్రాన్ని చూపించారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదించింది. మరో వైపు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చీఫ్ ఖమేనీ మరణించినట్లు తన సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఏకైక గొప్ప అవకాశం అని ట్రంప్ అన్నారు. 1989 నుండి ఇరాన్‌కు నాయకత్వం వహించిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేసిందని అమెరికన్ కమాండర్-ఇన్-చీఫ్ చెప్పారు.
The post ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ ఖతం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ ఖతం
Categories: