hyderabadupdates.com Gallery ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా post thumbnail image

బెంగ‌ళూరు : గీతా మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం టాక్సిక్. క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కీల‌క పాత్ర పోషిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. కానీ అనుకోకుండా ప్ర‌స్తుతం మ‌ధ్య ప్రాచ్యంలో యుద్దం కొన‌సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై విరుచుకు ప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కావాల్సిన టాక్సిక్ పై ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆలోచించిన మేక‌ర్స్ ఉన్న‌ట్టుండి ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చిత్ర నిర్మాతలు చివరి నిమిషంలో సినిమా విడుదల తేదీని మార్చి వాయిదా ప్రకటించడం ద్వారా అభిమానులను , ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
యష్ నటించిన టాక్సిక్ – ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఇప్పుడు జూన్ 4, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం సినిమాను సృష్టించాలనే దార్శనికతతో తాము భావించిన చిత్రం. కన్నడ, ఇంగ్లీషులో చిత్రీకరించిన ఈ మూవీ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత‌గానో ఎదురు చూస్తున్నారంటూ తెలిపారు. సంవత్సరాల అంకితభావంతో పనిచేసిన తర్వాత, మార్చి 19న మా చిత్రాన్ని మీ అందరితో పంచు కోవడానికి మేము సంతోషించామ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా టాక్సిక్ ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.
The post ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దుపాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు

హైద‌రాబాద్ : ఒక‌టా రెండా ఏకంగా రూ. 210 కోట్ల స్కాం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సింగ‌ర్ మంగ్లీ. త‌న స్వస్థలం రాయ‌ల‌సీమ‌. కానీ అనూహ్యంగా తెలంగాణకు వ‌చ్చింది. బంజారా క‌మ్యూనిటీకి చెందిన‌ది కావ‌డంతో మెల మెల్ల‌గా జ‌ర్న‌లిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది.

Manoj Gaur: హౌసింగ్‌ స్కాంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ అరెస్టుManoj Gaur: హౌసింగ్‌ స్కాంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ అరెస్టు

    హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో వేల కోట్ల మనీలాండరింగ్‌ కుంభకోణానికి సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కాంట్రాక్టు పనులను ఇదే మనోజ్‌గౌర్‌కు చెందిన జేపీ గ్రూపు

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ‌త 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అందుకే జ‌నం ఛీ కొట్టార‌ని,