hyderabadupdates.com Gallery ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు

ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు

ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు post thumbnail image

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ కు బెయిల్ ల‌భించింది. నిన్న ఆయ‌న‌ను ఈగెల్ టీం ఆధ్వ‌ర్యంలో ప‌ట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. దీంతో పోలీసులపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈగిల్ టీంతో పాటు పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు చెందిన రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద‌నుంచి డ్ర‌గ్స్ తో పాటు పిస్ట‌ల్, బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా మొత్తం డ్ర‌గ్స్ పార్టీకి సంబంధించి ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో క‌లిసి మొత్తం 11 మందిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు ఈగిల్ టీం ఎస్పీ గిరిధ‌ర్.
విచిత్రం ఏమిటంటే ఈ డ్ర‌గ్స్ పార్టీలో ఒకే ఒక్క మ‌హిళ ఉండ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌ను ఆర్. ప్రియాంక రెడ్డి అని, ఆమె అడ్ర‌స్ సికింద్రాబాద్ అని ఉంద‌ని స‌మాచారం. ఇందులో బ‌డా కంట్రాక్ట‌ర్లు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉండ‌డంతో ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ తో పాటు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రియాంక రెడ్డి అనే మహిళకు కూడా స్టేషన్ బెయిల్ మంజూరు కావ‌డం విశేషం. అయితే తమకు అందుబాటులో ఉండాలని పుట్టా మహేష్ సహా అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. FSI బ్లడ్ రిపోర్ట్ వచ్చేవరకు తమకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కన్స్యూమర్స్ గా ఉన్న తాము 45 రోజులు రిహాబ్ సెంటర్లో ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రాను మిజిస్ట్రేట్ ముందు హాజరు ప‌రిచారు.
The post ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కొత్త కాన్సెప్ట్‌ తో ఆనంద్‌ దేవరకొండ!కొత్త కాన్సెప్ట్‌ తో ఆనంద్‌ దేవరకొండ!

థియేటర్స్‌లో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నా, ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ పైన కూడా మంచి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, ఈ డిజిటల్‌ వేదికలపై కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వరుసగా వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా వినూత్న

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆదివారం సీఈసీ ఆయా రాష్ట్రాల‌లో నిర్వ‌హించే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు విడ‌త‌లుగా పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ,

Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?

Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ