hyderabadupdates.com Gallery ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్

ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్

ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్ post thumbnail image

చెన్నై : 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. సోమ‌వారం ఆయ‌న జెండాను ఆవిష్క‌రించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము ఏక రూప భార‌త దేశాన్ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. 143 కోట్ల‌మంది ప్ర‌జ‌లు కేవ‌లం ఏకీకృత భార‌త దేశం కావాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఆయ‌న త్రిభాషా విధానాన్ని ఎట్టి ప‌రిస్థితిలో ఒప్పుకునేది లేద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఆయ‌న నిరంత‌రం కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నారు. ఈ త‌రుణంలో తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. భారతదేశంలో అనేక స్వరాలు ఉన్నాయని అన్నారు. అనేక గుర్తింపులు దేశాన్ని తీర్చిదిద్దాయని ముఖ్యమంత్రి స్ప‌ష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని ఏకరూప భారతదేశంగా కాకుండా, ఐక్య భారతదేశంగా జరుపుకోవాలని నొక్కి చెప్పారు. సంస్కృతులు ఒకదానికొకటి సుసంపన్నం చేసుకుంటూ, భాషలు గర్వంగా సహ జీవనం చేసే దేశంగా ఇది కొనసాగాలని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతి పౌరుడు గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో , స్వేచ్ఛతో జీవించ గలిగినప్పుడే భారతదేశం ముందుకు సాగుతుంద‌న్నారు. కులం పేరుతో, మ‌తం పేరుతో, ప్రాంతం పేరుతో రెచ్చ‌గొడుతూ ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాల‌ను ర‌గిలిస్తూ వ‌స్తున్న వారికి ఇది చెంప‌పెట్టుగా మారాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగురూక‌త‌తో ఉండాల‌ని సూచించారు ఎంకే స్టాలిన్.
విశ్వాసం ఒక వ్యక్తిగత సత్యంగా ఉండే దేశంగా మనం కొనసాగాల్సిన అవస‌రం ఉంద‌న్నారు సీఎం.మన బలం ఎప్పుడూ ఏకరూపత కాదన్నారు. అది ఎల్లప్పుడూ మన బహుళత్వం. వైవిధ్యం రక్షించ బడినప్పుడు, ఐక్యతా భావన సహజంగా ఉంటుంద‌న్నారు ఎంకే స్టాలిన్.
The post ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డిరేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డి

కరీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములుశ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు

Pawan Kalyan’s ‘OG’ Crosses ₹250 Crore Worldwide, Set to Enter ₹300 Crore ClubPawan Kalyan’s ‘OG’ Crosses ₹250 Crore Worldwide, Set to Enter ₹300 Crore Club

Power Star Pawan Kalyan’s latest release OG has demonstrated the box-office potential of a well-planned, straight commercial entertainer. Directed by young filmmaker Sujeet, the film has already grossed over ₹250