hyderabadupdates.com Gallery ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి

ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి

ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి post thumbnail image

అమరావతి : రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇందుకు తగ్గట్టుగా మంచి పనులు చేసి ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికల కంటే నేడు కూటమి బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తితో మున్ముందు పని చేయాలన్నారు. మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ శాసనసభా పక్ష ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
గుజరాత్‌లో వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచి అధికారంలో ఉందని, ఇదే స్ఫూర్తితో ఇక్కడా విజయాలు సొంతం చేసుకోవాలన్నారు. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం సూచించారు. ఈ 20 నెలల్లో చాలా కష్టపడి, ఐక్యంగా పని చేశామని సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి… ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకు వెళుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని, ఐక్యంగా ముందుకు వెళతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో… భవిష్యత్‌లో అలాగే పని చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని వాటిని పరిష్కరించుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమి ధర్మాన్నికి ప్రతి ఒక్కరం కట్టుబడి బడి పని చేయాలని సూచించారు.
The post ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వ‌చ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల

ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్

బెంగ‌ళూరు : మాజీ భార‌త క్రికెట‌ర్ రాబిన్ ఊతప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాదిలో మార్చి 28వ తేదీ నుంచి అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. తొలి సెష‌న్ లో 20 మ్యాచ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000