hyderabadupdates.com Gallery ఏపీలో సింగ‌పూర్ మోడ‌ల్ తో ప‌రిపాల‌న

ఏపీలో సింగ‌పూర్ మోడ‌ల్ తో ప‌రిపాల‌న

ఏపీలో సింగ‌పూర్ మోడ‌ల్ తో ప‌రిపాల‌న post thumbnail image

సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రుల బృందం బిజీగా గ‌డుపుతోంది సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో. టూర్ లో భాగంగా ఇప్ప‌టికే ఆ దేశం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, పాల‌నా ప‌రంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి ఆరా తీశారు. మ‌రో వైపు మంత్రుల‌కు నిపుణుల‌తో శిక్ష‌ణ ఇప్పించారు. ఇదిలా ఉండ‌గా సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రుల బృందంతో కలిసి సింగపూర్ మాజీ మంత్రి మిస్టర్ లిమ్ స్వీ సే తో సమావేశమయ్యారు. సింగపూర్ ప్రగతిలో కీలకమైన “Nation-First to We First” పరిణామం గురించి చర్చించిన‌ట్లు చెప్పారు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్.
ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ రంగాలు (People, Public, Private sectors) సమన్వయంతో పనిచేస్తూ దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలనే వ్యూహాలను పరిశీలించడం జ‌రిగింద‌ని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజల నమ్మకాన్ని పొందుతూ, దీర్ఘకాలిక అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలను అధ్యయనం చేసిన‌ట్లు తెలిపారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సింగపూర్ అమలు చేస్తున్న గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (Grievance Redressal Systems), నియోజకవర్గ స్థాయిలో ప్రజా ప్రతినిధుల బాధ్యతాయుత పనితీరుపై చర్చించామ‌న్నారు స‌త్య కుమార్ యాద‌వ్. ప్రజల అవసరాలకు అనుగుణంగా తక్షణమే స్పందించే పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించడంలో సింగపూర్ సాధించిన విజయాలను తెలుసుకున్నామ‌న్నారు.
మన రాష్ట్రంలో కూడా ప్రజా పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా ఈ అధునాతన విధానాలను అమలు చేసే అవకాశాలపై దృష్టి సారించామ‌న్నారు.
The post ఏపీలో సింగ‌పూర్ మోడ‌ల్ తో ప‌రిపాల‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రుప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రు

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు , లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ శ‌నివారం మ‌రాఠా లోని బివాండి కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని కోరుతూ కేసు దాఖ‌లు చేసింది రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్.

“KCR Confident: Jubilee Hills Victory ‘Inevitable,’ Holds Key Conclave”“KCR Confident: Jubilee Hills Victory ‘Inevitable,’ Holds Key Conclave”

The BRS party has taken the Jubilee Hills by-election with great pride. In this context, party chief Kalvakuntla Chandrasekhar Rao himself has been busy strategizing. He held a key meeting

Minister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడుMinister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడు

    విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలు అయిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డిల్లీలో ఉన్న కేంద్ర పౌర