hyderabadupdates.com Gallery తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం అధికారికంగా పార్టీని పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పేరు కూడా ఖ‌రారు చేశారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే త‌న తండ్రి మాజీ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ పెట్టారు. అది మొద‌ట్లో ఉద్య‌మంగా మొద‌లైంది. ఆ త‌ర్వాత పార్టీగా మార్చేశారు. మరో వైపు దానిని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చేశారు. దానిని దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న‌ట్లు ఢిల్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. కానీ తాను అనుకున్న‌ట్లు తెలంగాణ‌లో ప‌వ‌ర్ లోకి రాలేదు. త‌న‌ను కాద‌ని ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. దొర‌త‌నం చెల్ల‌ద‌ని తేల్చి చెప్పారు.
ఈ త‌రుణంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలుపాలైన త‌న కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత ఉన్న‌ట్టుండి త‌న కుటుంబంతో బంధం తెంచుకుంది. ఆ త‌ర్వాత జ‌నంలోకి వెళ్లింది. ఉన్న‌ట్టుండి ఇవాళ పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అన్న‌ట్టుగానే తానేమిటో నిరూపించింది. పార్టీ పేరు ప్ర‌క‌టించిన అనంత‌రం ప్ర‌సంగించారు. తాను 3 కోట్ల మందికి ‘అమ్మ’ను అవుతాన‌ని చెప్పారు క‌విత‌. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. ఆనాడు పాలించిన కుటుంబంలో నేనూ భాగంగా ఉన్నాన‌ని, అందుకు సిగ్గు పడుతున్నా. దీనికి క్షమాపణ చెబుతున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సాధించినందుకు తన జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆత్మ కోల్పోయిందని అందుకే ఇవాళ టీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు.
The post తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అట్లీ స్పెషల్‌ సాంగ్‌!అట్లీ స్పెషల్‌ సాంగ్‌!

అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా కోసం బన్నీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌కు ప్రత్యేకంగా ప్లాన్ జరుగుతోంది. ఆ పాట కోసం

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే బాల‌య్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించే ఛాన్స్ ఉంద‌ని సినీ