hyderabadupdates.com Gallery క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్

క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్

క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్ post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. త‌న స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. అందుకే త‌న‌తో ప‌ని చేయాల‌ని ప్ర‌తి న‌టి, న‌టుడు , టెక్నీషియ‌న్స్ ఆశిస్తారు. కోరుకుంటారు కూడా. తాజాగా తాను క‌త్తి మూవీ గురించి స్పందించాడు. తాను ఆ మూవీ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌ర‌గ‌డం పై మండిప‌డ్డాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ వాపోయాడు. దీంతో తానే స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. ఇదిలా ఉండ‌గా గ‌తంలోనే క‌త్తి మూవీ రిలీజ్ అయ్యింది. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీంతో ప్ర‌స్తుతం బిగ్ స‌క్సెస్ అయిన మూవీస్ కు కొన‌సాగింపుగా సీక్వెల్స్ తీసే ప‌నిలో ప‌డ్డారు ద‌ర్శ‌కులు.
ఆ కోవ‌లోకి వ‌చ్చేశాడు కోలీవుడ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. అయితే న‌టుడు సూర్య నటించనున్న ప్రత్యేక రోలెక్స్ చిత్రం కూడా ఇంకా నిర్మాణ దశలో ఉందని లోకేష్ ధృవీకరించారు. ఇక క‌త్తి -2 సీక్వెల్ ఆగి పోయిందంటూ దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ సీక్వెల్ ప‌నులు ముమ్మురంగా కొన‌సాగుతున్నాయ‌ని చెప్పాడు. అయితే పాన్ ఇండియా యంగ్ హీరో అల్లు అర్జున్ తో త‌న మూవీ పూర్తి చేశాక నెక్ట్స్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంద‌న్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. కాగా ఇత‌ర సినిమాల‌తో తాను ఒప్పందం చేసుకోవ‌డం, వాటిని పూర్తి చేయ‌డంపై ఫుల్ ఫోక‌స్ పెట్టాన‌ని , అందుకే ఈ సీక్వెల్ పై ఇంకా ముందుకు సాగ‌డం లేద‌న్నాడు కోలీవుడ్ డైరెక్ట‌ర్.
The post క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్

    బిహార్‌ ఎన్నికల వేళ ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం జరిపిన పంపకాలపై ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్‌పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం

ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరాఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా

న్యూఢిల్లీ : వైసీపీ ఎంపీ గురుమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో అమలాపురంలో జరిగిన ఓఎన్‌జీసీ చమురు బావి పేలుడు ఘటనపై పార్లమెంట్‌లో ప్రశ్నను లేవనెత్తారు. ఏపీలోని మోరి5 క్షేత్రంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించిన పనుల సమయంలో గ్యాస్