hyderabadupdates.com movies కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?

కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తాజాగా మ‌రో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి రిమార్డ్ రిపోర్టులో పేర్కొ న్నారు. ఈ కేసులో కోట్ల రూపాయ‌ల ముడుపులు చేతులు మారాయ‌ని.. ఈ నిధుల‌ను సేక‌రించ‌డం.. క‌మీష‌న్లు రాబ‌ట్ట‌డం.. వంటి విష‌యాల్లో.. ముప్పిడి అవినాష్ రెడ్డి సూత్ర‌ధారి అని పేర్కొన్నారు.

ఏం చేశాడంటే..

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారి(ఏ1) క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డితో క‌లిసి.. అవినాష్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసిన‌ట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. క‌మీష‌న్లు సేక‌రించి.. వాటిని సిండికేట్‌కు అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడని తెలిపారు. ఈ మొత్తం సిండికేట్‌కు అవినాష్‌రెడ్డే కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. ఆర్థిక వ్య‌వ‌హారాల‌న్నీ ఆయ‌నే చూశాడ‌ని తెలిపారు. ఉద్దేశ పూర్వ‌కంగానే నిధులను దారి మ‌ళ్లించి.. సిండికేట్ లోని కీల‌క వ్య‌క్తుల‌కు చేర‌వేశాడ‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. ఎవ‌రైతే ఎక్కువ క‌మీష‌న్‌కు ఒప్పుకొంటారో.. వారికి మాత్ర‌మే ఆర్డ‌ర్లు ఇచ్చేలా చ‌క్రం తిప్పాడని కూడా సిట్ త‌న రిపోర్టులో స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ముప్పిడి అవినాష్ సిట్ అధికారుల ముందు లొంగిపోయాడు. ముంద‌స్తు బెయిల్‌ను కోరిన‌ప్ప‌టికీ.. నేర తీవ్ర‌త నేప‌థ్యంలో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీక‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో అధికారుల ముందు లొంగిపోయిన అవినాష్‌రెడ్డిపై రిమాండ్ రిపోర్టును ప్రిపేర్ చేశారు.

3500 కోట్లు..

మ‌ద్యం త‌యారీ కంపెనీల నుంచి 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు ముడుపులు సేక‌రించిన‌ట్టు రిమాండ్ రిపోర్టులో స్ప‌ష్టం చేశారు. ఈ సొమ్మును 2024 అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించే విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని తెలిపారు. విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డిపిన ముప్పిడి.. తానే అన్నీ అయి వ్య‌వ‌హ రించిన‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌భుత్వ దుకాణాల ద్వారానే అక్ర‌మాల‌కు తెర‌దీశార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Related Post

Mahesh Babu’s Double Role in Rajamouli’s Varanasi Stuns FansMahesh Babu’s Double Role in Rajamouli’s Varanasi Stuns Fans

Superstar Mahesh Babu is all set to surprise audiences with a never-before-seen dual role in SS Rajamouli’s much-awaited global project Varanasi, a film that is already generating massive buzz across