hyderabadupdates.com movies కొత్త సెన్సేషన్ ‘ఎకో’… అంతగా ఏముంది

కొత్త సెన్సేషన్ ‘ఎకో’… అంతగా ఏముంది

మలయాళం చిత్ర పరిశ్రమ మరో బ్యాంగర్ ఇచ్చింది. ఇటీవలే విడుదలైన ఎకో కేరళ, తమిళనాడులో సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో పాటే రిలీజైన పృథ్విరాజ్ సుకుమారన్ విలయత్ బుద్ధా బాగా వెనుకబడి పోగా పబ్లిక్ రెస్పాన్స్, రివ్యూలు రెండూ నెగటివ్ గానే ఉన్నాయి. దీనికి రివర్స్ లో ఎకోకి వచ్చిన రిపోర్ట్స్ అంతకంతా వసూళ్లను పెంచుకుంటూ పోతున్నాయి. రెండింటి మధ్య బుకింగ్స్ వ్యత్యాసం యాభై శాతానికి పైగా ఉండటం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ లో తక్కువ షోలు ఇచ్చినప్పటికీ వేగంగా ఫుల్ అవుతున్నాయి. ఇంతకీ ఎకోలో ఏముందో ఒక లుక్ వేద్దాం.

ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. అయిదు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన కురియాచన్ కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారు. కుక్కల సంరక్షకుడిగా పేరున్న ఇతనికి ఎన్నో నేరాలతో సంబంధం ఉంటుందనేది బయట జనం నమ్ముతున్న నిజం. భార్య మ్లాతి చేదతి కూడా ఈ రహస్యాన్ని గుట్టుగా కాపాడుకుంటూ వస్తుంది. నక్సలైట్లను వేధించడంతో పాటు ఎందరినో హింసించడం వెనుక కురియాచన్ హస్తం ఉందని పోలీసులు, విలన్లు వెంటపడుతూ ఉంటారు. అయితే అడవిలో ఉన్న క్రూరమైన కుక్కలకు, బయటికి కనిపించని మాఫియా ప్రపంచానికి ఉన్న లింకు ఎలా బయటపడిందనేది అసలు స్టోరీ.

సూక్ష్మ దర్శిని, కిష్కిందకాండం లాంటి స్లో మల్లువుడ్ థ్రిల్లర్స్ నచ్చినవాళ్లకు ఎకో సందేహం లేకుండా మెప్పిస్తుంది. స్లోగా మొదలుపెట్టి దాన్ని క్రమంగా థ్రిల్లర్ స్టయిల్ లోకి తీసుకెళ్లి చివర్లో విలన్ ని రివీల్ చేసిన విధానం చాల బాగుంది. దర్శకుడు దింజిత్ అయ్యతన్ స్క్రీన్ ప్లేని నడిపించిన విధానం ఆకట్టుకుంది. ఆర్టిస్టులు సౌరభ్ సచ్ దేవ్, సందీప్ ప్రదీప్, వినీత్, నరైన్ తదితరుల పెర్ఫార్మన్స్ పోటాపోటీగా సాగుతుంది. సహజమైన లొకేషన్లు, నెమ్మదిగా ఉన్నా గ్రిప్పింగ్ గా సాగే నెరేషన్ ఈ జానర్ ప్రేమికులను సంతృప్తి పరుస్తుంది. తెలుగు డబ్బింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా వస్తే బెటర్.

Related Post

పోల‌వ‌రంలో జ‌గ‌న్‌కు ముడుపులు.. జ్యోతుల సంచ‌ల‌నం..!పోల‌వ‌రంలో జ‌గ‌న్‌కు ముడుపులు.. జ్యోతుల సంచ‌ల‌నం..!

పోలవరం ప్రాజెక్టును తన తండ్రి మాజీ సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని దీనిని తాను ప్రాణప్రదంగా భావిస్తున్నామని వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనూ పోలవరం ప్రాజెక్టుపై ఆయన సుదీర్ఘ ప్రసంగం