తిరుమల: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు టీటీడీ సీవీ ఎస్ఓ మురళీకృష్ణ ఆదేశాల మేరకు పోలీసులు తిరుమలలో నాఖా బందీ చేపట్టారు. గాలి గోపురం, 7వ మైల్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.58 మంది సిబ్బంది, 2 బృందాలు 63 షాపులు తనిఖీ చేశారు. 6 షాపులకు నోటీసులు ఇచ్చారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు .2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులపై హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ వజ్రపహార్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టారు. భక్తుల భద్రతకు భంగం కలిగించే విధంగా నిషేధిత వస్తువులు వినియోగించరాదని స్పష్టం చేశారు. గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను తీసుకు రావడం, వినియోగించడం చేయరాదని అన్నారు. షాపులలో పనిచేసే సిబ్బందికి కఠినంగా సూచనలు చేశారు.
పోలీస్ సహా పలు విభాగాల 58 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి షాపులను తనిఖీ చేశారు. లైసెన్సులు, సిబ్బంది వివరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు లేని 6 షాపులకు నోటీసులు జారీ చేయగా, సరైన గుర్తింపు లేని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిషేధిత వస్తువుల వినియోగంపై కఠిన హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, షాపులు నిబంధనల ప్రకారం నడపాలని, అపరిచితులకు ఇవ్వకూడదని సూచించారు. అత్యవసర నంబర్లు 112, 1972 పై అవగాహన కల్పించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.
The post తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం
Categories: