hyderabadupdates.com Gallery 23న అన‌కాప‌ల్లిలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

23న అన‌కాప‌ల్లిలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

23న అన‌కాప‌ల్లిలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న post thumbnail image

అన‌కాప‌ల్లి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 23న అన‌కాప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే విజయ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ , జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స‌మీక్ష చేప‌ట్టారు. రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో రాంబిల్లి మండల పరిధిలోని జడ్.చింతువ పంచాయతీ శివారు గజిరెడ్డిపాలెం గ్రామంలో 136 ఎకరాల్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న రెన్యూ ఫొటోవోల్టాయిక్స్’ ప్లాంట్ కు (సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ) శంకుస్థాపన చేసేందుకు రానున్నారు సీఎం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
హెలిప్యాడ్, సమావేశ ప్రాంగణం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు తదితర కీలక అంశాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా, ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా మళ్లించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ శౌర్యా మాన్ పటేల్, అడ్డు రోడ్డు ఇంచార్జి ఆర్డీవో వి.వి.రమణ, పరవాడ సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ బి.మోహనరావు, రాంబిల్లి ఇన్స్పెక్టర్ నర్సింగరావు, ఎలమంచిలి సిఐ ధనుంజయ రావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు, ఎస్సై నాగేంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
The post 23న అన‌కాప‌ల్లిలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జాస్వామిక మార్గంలోనే స‌మాజంలో మార్పు సాధ్యంప్ర‌జాస్వామిక మార్గంలోనే స‌మాజంలో మార్పు సాధ్యం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని అన్నారు. ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి,

ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోనుఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను

న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌మాన్ అవార్డుల ప్ర‌దానోత్సం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త జ‌ట్టు త‌ర‌పున

దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటుదేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు

అన‌కాప‌ల్లి : అన‌కాప‌ల్లి నియోజ‌వ‌ర్గంలోని పాయ‌క‌రావుపేట‌లో భారీ ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మాట్లాడారు. ఏపీలో ఓ భారీ స్థాయి స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ